Hyderabad: వార్నీ.. చివరకు డాక్టర్ కూడా మోసపోయారుగా.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 07:51 AM
తాను ఆర్మీ కల్నల్‌ను అని, మెడికల్ సర్టిఫికెట్లు కావాలని వైద్యురాలిని సంప్రదించిన సైబర్ నేరగాడు(Cyber criminal) రూ.1.40 లక్షలు కొల్లగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ వైద్యురాలికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.
ఆర్మీ కల్నల్ పేరుతో బురిడీ.. రూ.1.40 లక్షలు మోసపోయిన డాక్టర్
హైదరాబాద్ సిటీ: తాను ఆర్మీ కల్నల్‌ను అని, మెడికల్ సర్టిఫికెట్లు కావాలని వైద్యురాలిని సంప్రదించిన సైబర్ నేరగాడు(Cyber criminal) రూ.1.40 లక్షలు కొల్లగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ వైద్యురాలికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్(WhatsApp call) వచ్చింది. అవతలి వ్యక్తి ఆర్మీ కల్నల్‌గా పరిచయం చేసుకున్నాడు. తన వద్ద 90మంది మహిళా క్యాడెట్స్ ఉన్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాడు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: వామ్మో.. ఎమ్మెల్యే దానం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ఒక్కో అభ్యర్థికి రూ.400చొప్పున మొత్తం రూ.37వేలు ఆన్‌లైన్(Online)లో పంపిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత వైద్యురాలికి వీడియో కాల్ చేశాడు. కల్నల్ డ్రస్‌లో ఉన్న అతడు డాక్టర్ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ముందుగా రూ.10 పంపిస్తానని, క్రెడిట్ అయినట్లు కన్ఫమ్ చేస్తే మిగిలిన డబ్బులు చెల్లిస్తానని చెప్పా డు. అదంతా నిజమని నమ్మిన బాధితురాలు బ్యాంకు ఖాతా వివరా లు చెప్పింది. తర్వాత రూ.10 పంపించానని, ఖాతాలో జమయ్యాయో లేదో చెప్పాలని అవతలి వ్యక్తి ఫోన్‌లో అడిగాడు.
మెసేజ్‌లు ఓపెన్ చేసిన బాధితురాలు ఎలాంటి డబ్బులుజమ కాలేదని చెప్పింది. తర్వా త బ్యాంకు ఖాతాలను చెక్ చేయగా.. రూ.1,40,972 డెబిట్ అయినట్లు గుర్తించింది. ఎలాంటి ఓటీపీ రాకుండా, ఏ విషయాలు షేర్ చేయకుంగా డబ్బులు డెబిట్ అయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకు అధికారులను సంప్రదించి నగదు జమ అయిన ఖాతాలను ఫ్రీజ్ చేయించారు.
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News