ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

ABN, Publish Date - May 18 , 2025 | 07:49 PM

యూపీఐ చెల్లింపుల సమయంలో అప్పుడప్పుడు తప్పు అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ టైప్ చేయడం వంటి కారణాలతో చెల్లింపులు జరుగుతుంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యూపీఐ కొత్త రూల్ (UPI New Rule) తీసుకొచ్చింది. దీని ద్వారా ఇకపై అలాంటి చెల్లింపులను కట్టడి చేయవచ్చని తెలిపింది.

UPI new rule 2025

దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రజలు తమ రోజువారీ చెల్లింపులను యూపీఐ ద్వారా ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల డబ్బు లావాదేవీలు క్షణాల్లోనే జరుగుతున్నాయి. అయితే, ఈ సౌకర్యాల నేపథ్యంలో కొన్నిసార్లు డబ్బు తప్పు ఖాతాకు బదిలీ అయినప్పుడు చిన్న పొరపాటు ఖరీదైనదిగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసేందుకు కొత్త నియమాన్ని (UPI New Rule) అమలు చేయాలని నిర్ణయించింది.


NPCI కొత్త రూల్ ఏంటి

కొత్త నియమం ప్రకారం ఒక వ్యక్తి యూపీఐ ద్వారా డబ్బు పంపినప్పుడు, అతను బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS)లో నమోదు చేయబడిన ఖాతా పేరును మాత్రమే చూస్తాడు. దీని అర్థం మీరు మీ ఫోన్‌లో సేవ్ చేసిన పేరు ఆధారంగా డబ్బును పంపలేరు. కానీ బ్యాంక్ వివరాల ప్రకారం అసలు పేరు లావాదేవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనివల్ల మీరు డబ్బు పంపించే వ్యక్తి పేరు ఈజీగా తెలిసిపోతుంది. ఆ క్రమంలో మనీ పంపించే వ్యక్తి పేరును నిర్ధారణ చేసుకుని పంపించుకోవచ్చు. పేరు చెల్లింపునకు ముందే కనిపించడం వల్ల తప్పు ఖాతా లేదా వ్యక్తులను మనీ పంపించే ఛాన్స్ ఉండదు.

ఈ లావాదేవీకి మాత్రం..

NPCI ప్రత్యేకంగా దీనిని P2P (పీర్ టు పీర్), P2PM (పీర్ టు పీర్ మర్చంట్) లావాదేవీలకు అమలు చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వినియోగదారులకు సరైన ఖాతాదారుడి గుర్తింపును చూపించడం, తద్వారా గందరగోళానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఒకరి ఫోన్‌లో వేరే పేరుతో నంబర్ సేవ్ చేయబడి, దాని ఆధారంగా లావాదేవీ జరగడం తరచుగా జరుగుతుంది, కానీ ఇప్పుడు ఈ తప్పు జరగదని చెప్పవచ్చు.


కొత్త రూల్ ఎప్పటి నుంచి అమలు

NPCI ప్రకటించిన ఈ కొత్త నియమం జూన్ 30, 2025 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని UPI ప్లాట్‌ఫామ్‌లలో అమలులోకి వస్తుంది. అంటే Google Pay, PhonePe, Paytm, BHIM వంటి అన్ని UPI యాప్‌లు ఈ మార్పును పాటిస్తాయి.

అయినా కూడా పొరపాటు జరిగితే ఏం చేయాలి

కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చెల్లింపుల విషయంలో తప్పు జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొరపాటున డబ్బు పంపబడిన వ్యక్తిని సంప్రదించాలి. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే, వెంటనే మీ సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. లేదంటే NPCI హెల్ప్‌లైన్ 1800-120-1740కు కాల్ చేసి లేదా NPCI వెబ్‌సైట్‌ను సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు.


ఇవి కూడా చదవండి

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్


Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..


EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 07:53 PM