Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
ABN, Publish Date - Apr 27 , 2025 | 04:36 PM
పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న ఐపీఓల వీక్ మళ్లీ రానే వచ్చేసింది. అయితే ఈసారి ఎన్ని ఐపీఓలు రాబోతున్నాయి. ఎన్ని కోట్ల పెట్టుబడలు చేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. వచ్చే వారం (ఏప్రిల్ 28) నుంచి మార్కెట్లోకి కొత్త ఐపీఓలు రాబోతున్నాయి. ఏథర్ ఎనర్జీ ఐపీఓ సహా ఇంకొన్ని వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఏథర్ ఎనర్జీ ఐపీఓ: మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తున్న ఈ ఇష్యూ విలువ రూ. 2,981.06 కోట్లు. ఇది ఏప్రిల్ 28న ప్రారంభమై, ఏప్రిల్ 30న ముగుస్తుంది. మే 2న షేర్ల కేటాయింపు, మే 6న షేర్లు BSE, NSEలో జాబితా చేయబడతాయి. ఈ IPOలో బిడ్డింగ్ ధర బ్యాండ్ ఒక్కొ షేరుకు రూ. 304-321. లాట్ సైజు 46.
ఐవేర్ సప్లైచైన్ సర్వీసెస్ IPO: ఈ ఇష్యూ సైజు రూ.27.13 కోట్లు, ఏప్రిల్ 28న ప్రారంభమై, ఏప్రిల్ 30న ముగుస్తుంది. ఇందులో మీరు ఒక్కొ షేరుకు రూ.95 ధరకు 1200 లాట్‌లో బిడ్ చేయవచ్చు. ఇష్యూ ముగిసిన తర్వాత, మే 2న కేటాయింపు జరుగుతుంది. షేర్లు మే 6న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి. ఈ ఇష్యూలో 28.56 లక్షల కొత్త షేర్లు మాత్రమే ఉంటాయి.
అరుణయ ఆర్గానిక్స్ ఐపీఓ: ఇది కూడా ఏప్రిల్ 29న ప్రారంభమవుతుంది. దీని బిడ్డింగ్ షేరుకు రూ. 55-58 మధ్య ఉంటుంది. రూ. 2,000 లాట్స్ తీసుకోవాలి. ఈ IPO పరిమాణం రూ.33.99 కోట్లు. మే 5న షేర్ల కేటాయింపు, మే 7న షేర్లు NSE SMEలో లిస్టింగ్ ఉంటుంది. ఈ IPO ద్వారా రూ.30.51 కోట్ల విలువైన 52.60 లక్షల కొత్త షేర్లు, రూ.3.48 కోట్ల విలువైన 6 లక్షల షేర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
కెన్రిక్ ఇండస్ట్రీస్ IPO: ఈ ఇష్యూ పరిమాణం రూ. 8.75 కోట్లు. ఈ IPO ఏప్రిల్ 29న ప్రారంభమై, మే 6న ముగుస్తుంది. మే 7న షేర్ల కేటాయింపు ఉంటుంది. ఈ IPOలో బిడ్డింగ్ ధర షేరుకు రూ. 25, లాట్ సైజు 6000. ఇష్యూ ముగిసిన తర్వాత, మే 9న షేర్లు BSE SMEలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.
వ్యాగన్స్ లెర్నింగ్ IPO: రూ. 38.38 కోట్ల ఈ ఇష్యూ మే 2న ప్రారంభమై, మే 6న ముగుస్తుంది. కేటాయింపు మే 7న ఉంటుంది. షేర్లు మే 9న BSE SMEలో లిస్ట్ కానున్నాయి. ఈ IPO ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 78-82. లాట్ సైజు 1600 షేర్లు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 27 , 2025 | 04:36 PM