Financial Mistakes: ఈ అలవాట్లు మీ ఆర్థిక జీవితాన్ని నాశనం చేస్తాయ్.. జాగ్రత్త
ABN, Publish Date - Jun 29 , 2025 | 10:47 AM
మీరు రోజూ కష్టపడి పని చేస్తారు. అయినప్పటికీ మీరు మాత్రం సేవింగ్స్ చేయలేకపోతారు. ఇది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న. మీరు ఎంత సంపాదించినా కూడా ఖర్చు నియంత్రణ (Financial Mistakes) లేకపోతే మాత్రం సంపాదన కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం పెరగడం లేదు. నిజం ఏమిటంటే, మీరు ఎంత సంపాదిస్తారనేది మాత్రమే కాదు, మీ డబ్బును ఎలా నిర్వహిస్తారనేది కూడా చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆర్థిక అలవాట్లు, చాలా సందర్భాలలో సాధారణం అని అనుకుంటారు. కానీ అవి మీ ఆర్థిక స్వేచ్ఛను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. ఆకస్మిక కొనుగోళ్ల నుంచి బడ్జెట్‌ను పట్టించుకోకపోవడం వరకు మిమ్మల్ని ఆర్థికంగా వెనక్కి నెట్టే కొన్ని చెడు డబ్బు అలవాట్ల (Financial Mistakes) గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆకస్మిక కొనుగోళ్లు
ఆకస్మిక కొనుగోళ్లు మీ ఆదాయాన్ని త్వరగా ఖాళీ చేస్తాయి. రాత్రిపూట ఆన్‌లైన్ ఆర్డర్‌లు, సేల్‌లలో కొనుగోళ్లు లేదా భావోద్వేగ కొనుగోళ్లు క్రమంగా మీ ఆదాయాన్ని తగ్గిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి అవసరం లేని వస్తువులను కొనే ముందు ఒక రోజు వేచి ఉండండి. ఇది మీ నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్ ఇస్తుంది.
2. ఖర్చులను ట్రాక్ చేయకపోవడం
మీ ఖర్చులను ట్రాక్ చేయకపోతే, వాటిని నియంత్రించడం చాలా కష్టం. కాఫీ, టేక్ అవుట్ వంటి చిన్న ఖర్చులు గుర్తించకుండానే పెరిగిపోతుంటాయి. ఇవి ఆదా చేయడాన్ని కష్టతరం చేస్తాయి. ఒక సాధారణ బడ్జెట్ యాప్ ఉపయోగించడం ద్వారా మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు.
3. క్రెడిట్ కార్డ్ డ్యూ మాత్రమే చెల్లించడం
క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం అనేది మిమ్మల్ని అప్పుల చక్రంలో చిక్కుకునేలా చేస్తుంది. ఆ క్రమంలో మిగిలిన బకాయి మొత్తంపై సంవత్సరానికి 36% నుంచి 48% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం కంటే ఎక్కువ చెల్లించడానికి ప్రయత్నిస్తే మొత్తం బకాయిని త్వరగా క్లియర్ చేసుకోవచ్చు.
4. అత్యవసర నిధి లేకపోవడం
అత్యవసర నిధి లేకపోతే వైద్య బిల్లులు లేదా కారు మరమ్మత్తు వంటి ఊహించని ఖర్చులు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి (Financial Mistakes). అప్పుల్లోకి నెట్టేస్తాయి. మూడు నుంచి ఆరు నెలల అత్యవసర ఖర్చుల కోసం ఒక ప్రత్యేక నిధిని సృష్టించుకోండి.
5. అనవసర సబ్‌స్క్రిప్షన్‌లు
స్ట్రీమింగ్, యాప్‌లు లేదా మెంబర్‌షిప్‌ల వంటి ఆటో-రెన్యూ సబ్‌స్క్రిప్షన్‌లు మీ బడ్జెట్‌ను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా సమీక్షించండి. ఉపయోగించని వాటిని రద్దు చేయండి.
6. భావోద్వేగ ఖర్చు
భావోద్వేగ ఖర్చు తాత్కాలిక ఉపశమనం ఇవ్వవచ్చు. కానీ ఇది దీర్ఘకాలికంగా ఆదాయ నష్టానికి దారితీస్తుంది. షాపింగ్‌కు బదులుగా, వ్యాయామం లేదా స్నేహితులతో సమయం గడపడం వంటి ఉచిత ఒత్తిడి నివారణ చర్యలను ఎంచుకోండి.
7. ఆర్థిక లక్ష్యాలు లేకపోవడం
స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకపోతే, డబ్బు సులభంగా చేజారిపోతుంది. ఇల్లు కొనడం, రిటైర్మెంట్ లేదా వ్యాపారం ప్రారంభించడం వంటి లక్ష్యాలు మీ ఖర్చులను క్రమంగా తగ్గిస్తాయి.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 11:16 AM