Telangana Grameena Bank: టీజీబీ చైర్మన్‌గా ప్రతాప రెడ్డి
ABN, Publish Date - May 31 , 2025 | 03:35 AM
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) చైర్మన్‌గా కే ప్రతాప రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌బీఐలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ప్రతాప రెడ్డి, టీజీబీలో మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) చైర్మన్‌గా కే ప్రతాప రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యవసాయం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రిటైల్, కమర్షియల్, రూరల్ బ్యాంకింగ్ రంగాల్లో అపారమైన అనుభవం కలిగిన ప్రతాప రెడ్డి టీజీబీ చైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. టీజీబీ మాతృసంస్థ అయిన ఎస్‌బీఐలో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్‌గా రెండేళ్ల పాటు సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏపీజీవీబీ కార్యకలాపాలన్నీ టీజీబీలో విలీనమయ్యాయి.
కాగా మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను టీజీబీ రూ.73,791 కోట్ల మొత్తం వ్యాపారంపై రూ.675 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో టీజీబీ 17 రీజినల్ బిజినెస్ కార్యాలయాలతో మొత్తం 934 శాఖలను నిర్వహిస్తోంది.
Updated Date - May 31 , 2025 | 03:36 AM