ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు వరుస నష్టాలు..

ABN, Publish Date - Aug 07 , 2025 | 10:02 AM

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 సుంకాలను విధించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను కొనసాగిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపుల కారణంగా అంతర్జాతీయంగా కూడా మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాలతో మొదలయ్యాయి.

Stock Market

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 సుంకాలను విధించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను కొనసాగిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపుల కారణంగా అంతర్జాతీయంగా కూడా మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాలతో మొదలయ్యాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం కాస్త సానుకాలాంశంగా కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో ఉన్నాయి (Business News).

బుధవారం ముగింపు (80, 543)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. పలు రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండడంతో నష్టాల్లోనే కదలాడుతోంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 279 పాయింట్ల నష్టంతో 80, 264 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 78 పాయింట్ల నష్టంతో 24, 495 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో ఫోర్టిస్ హెల్త్, లూపిన్, పిరామిల్ ఫార్మా, గ్రాన్యుయల్స్ ఇండియా, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భెల్, జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్, కంటైనర్ కార్పొరేషన్, భారత్ ఫోర్జ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 111 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.71గా ఉంది.

ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 10:02 AM