Share News

RBI on Repo Rate: ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..

ABN , Publish Date - Aug 06 , 2025 | 10:30 AM

రెపో రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ మేరకు రెపో రేటు 5.5 శాతం దగ్గరే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

RBI on Repo Rate: ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..
Repo Rate

బిజినెస్ డెస్క్: రెపో రేటు(Repo Rate) యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) తెలిపారు. ఈ మేరకు రెపో రేటు 5.5 శాతం దగ్గరే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాలతో రెపో రేటు యధాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో రెపో రేటు అలాగే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు.


ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అది 3.1 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా ముందుకెళ్తోందని శుభవార్త చెప్పారు.


అలాగే ఈ ఏడాది రుతుపవనాలు సమృద్ధిగా కొనసాగుతున్నాయని చెప్పారు. దీంతో వర్షాలు ఎక్కువగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత దిగువకు రానుందని ఎంపీసీ నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్‌ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ.. ప్రస్తుత సంవత్సరంలో రెపో రేటును 1 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ

Bihar Intercaste Marriage Incident: దారుణం.. కన్న కూతురు ముందే అల్లుడిని హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

Updated Date - Aug 06 , 2025 | 11:46 AM