ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN, Publish Date - Aug 11 , 2025 | 10:28 AM

గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది.

Stock Market

గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్‌ను దాటింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం కాస్త సానుకాలాంశంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో ఉన్నాయి (Business News).

గత శుక్రవారం ముగింపు (79, 857)తో పోల్చుకుంటే సోమవారంవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. పలు రంగాలు లాభాల్లో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:150 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 80, 054 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 61 పాయింట్ల లాభంతో 24, 425 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, మాజగాన్ డాక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, వోల్టాస్, పీఐ ఇండస్ట్రీస్, ఎల్‌ఐసీ ఇండియా షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 210 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.52గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 11 , 2025 | 10:28 AM