ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: మూడో రోజూ లాభాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN, Publish Date - Jun 26 , 2025 | 04:13 PM

అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో భారత్ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువెత్తవచ్చనే అంచనాల నడుమ మదుపర్లు కొనుగోళ్లుకు మొగ్గచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.

Stock Market

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చల్లారడం, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగిరావడంతో దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాలు అందుకున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో భారత్ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువెత్తవచ్చనే అంచనాల నడుమ మదుపర్లు కొనుగోళ్లుకు మొగ్గచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Business News).

బుధవారం ముగింపు (82, 755)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. సెన్సెక్స్ 83, 812 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంతో 83, 755 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 304 పాయింట్ల లాభంతో 25, 549 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25, 500 వేల మార్క్‌ను అందుకుంది.

సెన్సెక్స్‌లో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హిందుస్థాన్ కాపర్, దాల్మియా భారత్, సెయిల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్, మాజగాన్ డాక్, యూపీఎల్, కోల్గేట్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 345 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 585 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.70గా ఉంది.

ఇవి కూడా చదవండి..

వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు


జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2025 | 04:13 PM