పీఎస్‌యూల డీలిస్టింగ్‌కు ప్రత్యేక విధానం
ABN, Publish Date - May 07 , 2025 | 05:42 AM
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) స్వచ్ఛంద డీలిస్టింగ్‌ను సులభతరం చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన విధి...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) స్వచ్ఛంద డీలిస్టింగ్‌ను సులభతరం చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన విధి విదానాలతో ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ఈ చర్చా పత్రంపై మార్కెట్ వర్గాలు ఈనెల 26లోగా తమ స్పందన తెలియజేయాలని కోరింది.
చర్చా పత్రం ముఖ్యాంశాలు
మొత్తం ఈక్విటీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్, ఇతర పీఎస్‌యూలు 90 శాతానికి పైగా వాటా కలిగి ఉండాలి
ఇలాంటి పీఎ్‌సయూల ఈక్విటీలో కనీస పబ్లిక్ వాటా లేకపోయినా డీలిస్ట్ కావచ్చు
పీఎస్‌యూలు ఒక నిర్ణీత ధర వద్ద కూడా తమ షేర్లను డీలిస్ట్ చేయవచ్చు
షేర్ల ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా డీలిస్టింగ్ షేర్ల కనీస ధరపై 15 శాతం ప్రీమియం ఉండాలి
మూడింట రెండు వంతుల మంది వాటాదారుల ఆమోదం నిబంధన పీఎస్‌యూల డీలిస్టింగ్‌కు వర్తించదు.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 07 , 2025 | 05:42 AM