Mobile Anniversary Offers: సంగీత 51వ వార్షికోత్సవ ఆఫర్లు
ABN, Publish Date - Jun 01 , 2025 | 02:32 AM
సంగీత మొబైల్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలు పై రూ.2,500 వరకు వ్యాలెట్‌లో క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): రిటైల్ మొబైల్ వ్యాపారంలో కీలకంగా ఉన్న ‘సంగీత’ మొబైల్స్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంగీత వ్యవస్థాపకులు ఎల్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సంగీత వార్షికోత్సవం కోసం ఏటా వినియోగదారులు ఎదురు చూసేలా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నామన్నారు. 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంగీత మొబైల్ స్టోర్‌ను సందర్శించే ప్రతి ఒక్కరికి వ్యాలెట్ ద్వారా రూ.5,001 మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు తెలిపారు. మొబైల్‌తో పాటు ఏ వస్తువు కొనుగోలు చేసినా ఆఫర్ కింద రూ.2,500 వరకు వ్యాలెట్ నుంచి జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్స్‌తో పాటు అన్ని రకాలైన ఎలక్ర్టానిక్ ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చినట్లు సంగీత డైరెక్టర్ చందు రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ముంబైలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని తమ షోరూమ్స్‌ల్లో మొబైల్ కొనుగోలు చేస్తే 30 నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తున్నట్లు చందు తెలిపారు.
Updated Date - Jun 01 , 2025 | 02:34 AM