ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Savings Account Rules: కనీస నిల్వ నిర్ణయం బ్యాంకుల ఇష్టం

ABN, Publish Date - Aug 12 , 2025 | 03:43 AM

బ్యాంకులకు పొదుపు ఖాతాల కనీస నగదు నిల్వ పరిమితిని నిర్ణయించే స్వేచ్ఛ ఉందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఇది ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి రాదని...

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

గొజారియా (గుజరాత్‌): బ్యాంకులకు పొదుపు ఖాతాల కనీస నగదు నిల్వ పరిమితిని నిర్ణయించే స్వేచ్ఛ ఉందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఇది ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ తన పొదుపు ఖాతాల కనీస నిల్వ పరిమితిని 10,000 నుంచి ఏకంగా రూ.50,000కు పెంచడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని గొజారియా గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన ఓ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రాను మీడియా వర్గాలు ఇదే విషయంపై ప్రశ్నించాయి. ‘‘పొదుపు ఖాతాల కనీస నిల్వ పరిమితిపై నిర్ణయాన్ని ఆర్‌బీఐ ఆయా బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు కనీస నిల్వను రూ.10,000గా నిర్ణయించగా.. మరికొన్ని రూ.2,000కు పరిమితం చేశాయి. ఈ మధ్యనే కొన్ని బ్యాంకులు పరిమితిని పూర్తిగా ఎత్తివేశాయి. ఇది ఆర్‌బీఐ నియంత్రణలో లేని అంశ’’మని మల్హోత్రా సమాధానమిచ్చారు.

ఆర్థిక శాఖకు లేఖ రాసిన బీబీడీబీఎం: ఐసీఐసీఐ బ్యాంక్‌ తాజా నిర్ణయాన్ని బ్యాంక్‌ బచావో దేశ్‌ బచావో మంచ్‌ (బీబీడీబీఎం) తప్పుపట్టింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఈ సంస్థ లేఖ కూడా రాసింది. ఈ అన్యాయమైన, తిరోగమన నిర్ణయం బ్యాంకింగ్‌ సేవల సమ్మిళితం, వృద్ధి లక్ష్యాలకు విఘాతమని లేఖలో పేర్కొంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో కనీస నిల్వ పరిమితి ఎత్తివేత: ఎస్‌బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ).. పొదుపు ఖాతాల కనీస నిల్వ పరిమితిని ఎత్తివేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు వెల్లడించారు. దేశంలో అర్థిక సేవలను అందరికీ అందుబాటులో తేవాలన్న లక్ష్యాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని పీఎ్‌సబీలు ఈ పరిమితిని తగ్గించాయని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 03:43 AM