ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rafale Fighter Aircraft: గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లో రాఫెల్ విడిభాగాల తయారీ..

ABN, Publish Date - Jun 05 , 2025 | 03:19 PM

Rafale Fighter Aircraft: హైదరాబాద్‌లోని తయారీ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక విడిభాగాలను తయారు చేయనుంది. 2028 నాటికి రాఫెల్‌ విడిభాగాలు తయారయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది.

Rafale Fighter Aircraft

టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రెండు కంపెనీలు నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్లపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ రాఫెల్ యుద్ధ విమానాల బాడీని ఇండియాలో తయారు చేయనుంది. ఫ్రాన్స్‌లో కాకుండా బయటి దేశంలో రాఫెల్ విమానాల బాడీని తయారు చేయటం ఇదే మొదటి సారి. ఇక, ఈ ఒప్పందాల నేపథ్యంలో టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో రాఫెల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.


హైదరాబాద్‌లోని తయారీ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక విడిభాగాలను తయారు చేయనుంది. 2028 నాటికి రాఫెల్‌ విడిభాగాలు తయారయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్‌తో చేసుకున్న ఒప్పందాలపై డసాల్ట్ ఏవియేషన్స్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ.. ‘ ఇండియాలో సప్లై చెయిన్‌ను బలపర్చడానికి తీసుకున్న కీలక నిర్ణయం ఇది. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్‌కు ధన్యవాదాలు. మా మద్దతుతో టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ ఇండియాలో రాఫెల్‌ విమానాల తయారీని పెంచుతుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

వివాహంపై నోరు విప్పని ఎంపీ.. ఫొటో వైరల్

ఒళ్లు జలదరించే వీడియో.. ఒకే ఇంట్లో వంద పాములు

Updated Date - Jun 05 , 2025 | 03:30 PM