100 Snakes: ఒళ్లు జలదరించే వీడియో.. ఒకే ఇంట్లో వంద పాములు
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:25 PM
100 Snakes In 1 House: కొద్ది సేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని డ్రమ్ మూత తెరిచి చూశాడు. అంతే.. అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ డ్రమ్ములో దాదాపు 100 పాములు బుసలు కొట్టుకుంటూ అటు, ఇటు తిరుగుతూ ఉన్నాయి.
పాములంటే భయపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. పాములు పట్టే వాళ్లకైనా ఏదో ఒక మూల అవంటే భయం ఉండనే ఉంటుంది. ఎందుకంటే.. విషపూరితమైన పాములు కరిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాళ్లకు తెలుసు. అలాంటిది సాధారణ మనుషుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పామును చూడగానే గుండెలు జల్లుమంటాయి. భయంతో పరుగులు తీసేస్తారు. ఒకసారి ఊహించుకోండి. మీరు ఉండే ఇంట్లోనే ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా వంద పాములు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది.
ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదూ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముడియ కాలా గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ ఇంట్లోని డ్రమ్ములో దాదాపు 100 పాములు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం శ్రవణ్ కుమార్ ఇళ్లు శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మూలకు ఉన్న డమ్మును పక్కకు జరిపి.. ఆ చోటును శుభ్రం చేశాడు. తర్వాత దాన్ని అక్కడినుంచి పక్కకు తీద్దామని, పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఓ పాము ఠక్కున దాంట్లోంచి బయటకు వచ్చింది. శ్రవణ్ షాక్ అయ్యాడు.
దాన్ని అక్కడే పెట్టి పక్కకు పరుగులు తీశాడు. కొద్ది సేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని డ్రమ్ మూత తెరిచి చూశాడు. అంతే.. అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ డ్రమ్ములో దాదాపు 100 పాములు బుసలు కొట్టుకుంటూ అటు, ఇటు తిరుగుతూ ఉన్నాయి. అతడు వెంటనే సాయం కోసం పొరిగింటి వారిని పిలిచాడు. పాములు పట్టే మిత్ర అనే వ్యక్తికి కూడా సమాచారం వెళ్లింది. మిత్ర అక్కడికి చేరుకుని పాముల్ని రక్షించాడు. వాటిని క్షేమంగా దగ్గరలోని అడవిలో విడిచిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీల తగ్గింపు