ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: 1138 పాయింట్లు పడిపోయిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల ఆందోళన..

ABN, Publish Date - Feb 10 , 2025 | 04:09 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండు శాతం క్షీణించాయి. ప్రధానంగా మెటల్, మీడియా, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, రియాల్టీ భారీగా తగ్గాయి.

Stock Market updates

స్టాక్ మార్కెట్ (Stock Market) పెట్టుబడిదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలతో ముగిసింది. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 548.39 పాయింట్లు పడిపోయి 77,311.80 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 178.35 పాయింట్లు తగ్గి 23,381.60 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 1138 పాయింట్లు దిగజారింది.


ఈ స్టాక్స్ మాత్రం..

ఈ క్రమంలో సెన్సెక్స్‌లో నష్టపోయిన షేర్లలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ షేర్లు కొన్ని ప్రారంభ లాభాలను నమోదు చేశాయి. దీంతో పలువురు మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోగా, మరికొంత మంది మాత్రం లాభపడ్డారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల క్షీణించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ట్రంప్ నిర్ణయాలు కూడా..

సోమవారం రోజున ట్రంప్ తన ప్రకటనలో మాట్లాడుతూ వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కొత్త సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికా అంతర్జాతీయ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లు మరింత దిగజారాయి. గత వారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధానికి సంబంధించిన కొత్త సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది.


తగ్గిన రూపాయి విలువ

అంతర్జాతీయ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిన నేపథ్యంలో రూపాయి విలువ మరింత తగ్గింది. ఈ క్రమంలో రూపాయి విలువ 0.2% తగ్గి రూ. 87.59కి చేరుకుంది. రూపాయి విలువ తగ్గిన నేపథ్యంలో ఆహార ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు మరింత తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్ క్షీణతకు మరో కారణం ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పోటీ పెరగడం.

మార్కెట్ అంతటా..

ఈ క్రమంలో డాలర్ ఇండెక్స్ 108 స్థాయికి చేరుకుంది. 10 సంవత్సరాల US బాండ్ దిగుబడి 4.4 శాతానికిపైగా చేరింది. ఇదే సమయంలో ఫారెన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు (FII) మరింత అమ్మకాలు చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్ అంతటా అస్థిరత పెరిగింది. ఇండియా VIX (భారత మార్కెట్ అస్తిరత సూచిక) 5% పైగా పెరిగింది. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయాల ప్రస్తుత పరిణామాలను నమ్మినప్పటికీ, మార్కెట్లలో స్థిరమైన ర్యాలీకి దారితీసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 04:18 PM