Techview: మానసిక అవధి 26000
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:55 AM
నిఫ్టీ గత వారం 25,650 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమై వారం అంతా మైనర్ బలహీనత కొనసాగించింది. శుక్రవారం మైనర్ రికవరీతో 25,460 వద్ద ముగిసింది. అయినా వారం మొత్తం మీద 300 పాయింట్ల మేరకు...
టెక్ వ్యూ: మానసిక అవధి 26000
నిఫ్టీ గత వారం 25,650 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమై వారం అంతా మైనర్ బలహీనత కొనసాగించింది. శుక్రవారం మైనర్ రికవరీతో 25,460 వద్ద ముగిసింది. అయినా వారం మొత్తం మీద 300 పాయింట్ల మేరకు పరిమిత పరిధిలోనే కదలాడి చివరికి 176 పాయింట్లు నష్టపోయింది. ముందు వారం 25,000 వద్ద బ్రేకౌట్ సాధించిన అనంతరం ఏర్పడిన పుల్‌బ్యాక్ రియాక్షన్ ఇది. ఈ రియాక్షన్‌లో కూడా ప్రధాన మద్దతు స్థాయిల కన్నా పైనే ఉండడం తక్షణ ముప్పు లేదనేందుకు సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్ పాజిటివ్ ధోరణిలోనే ఉంది. తదుపరి నిరోధం 26,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ సాధించినట్టయితే ప్రధాన నిరోధం 25,600 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. తదుపరి మానసిక అవధి 26,000. ఇక్కడ కన్సాలిడేషన్ ఉండవచ్చు. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత పాజిటివ్‌గా పురోగమిస్తుంది.
బేరిష్ స్థాయిలు: రియాక్షన్ సాధించి మైనర్ మద్దతు స్థాయి 25,400 కన్నా దిగజారితే మైనర్ బలహీనతలో పడుతుంది. స్వల్పకాలిక మద్దతు స్థాయి 25,000. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 57,600 వద్ద రియాక్షన్ సాధించి వారంలో 412 పాయింట్ల నష్టంతో 57,000 వద్ద నిలకడగా ముగిసింది. అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే ప్రధాన నిరోధం 57,600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 58,000. బలహీనతలో ప్రవేశించినా 57,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. ఈ స్థాయిలో విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.
పాటర్న్: మరింత అప్‌ట్రెండ్ కోసం 25,600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి. అలాగే మార్కెట్ 25 డిఎంఏ కన్నా పైనే ఉండడం ట్రెండ్‌లో సానుకూలత సంకేతం. గత వారం మార్కెట్ ఓవర్‌బాట్ స్థితిని సద్దుబాటు చేసుకున్నట్టు కనిపిస్తోంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25550, 25600
మద్దతు : 25400, 25320
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 07 , 2025 | 03:55 AM