NASA layoffs: మరో అగ్ర సంస్థ షాకింగ్.. త్వరలో 2 వేల మంది ఉద్యోగుల తొలగింపు..
ABN, Publish Date - Jul 11 , 2025 | 03:32 PM
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పాయి. ఇప్పుడు అదే బాటలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA Layoffs) కూడా చేరబోతుంది.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2,145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు (NASA Layoffs) తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నత స్థాయి నిపుణులు, టాప్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు ఈ తొలగింపు జాబితాలో ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. ఈ తొలగింపుల నేపథ్యంలో నాసాలో పనిచేస్తున్న 18,000 మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
ఎందుకు ఈ ఉద్యోగ తొలగింపులు?
అయితే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బడ్జెట్ కోతలు, సైన్స్ ప్రోగ్రామ్‌ల రద్దు, అడ్మినిస్ట్రేటర్ నియామకంలో ఆలస్యం వంటి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. నాసా ప్రస్తుతం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో బడ్జెట్ కోతలు, కొన్ని సైన్స్ ప్రాజెక్టుల రద్దు లాంటి సవాళ్లు నాసా ముందున్నాయి. ఇటీవల ట్రంప్ నామినేట్ చేసిన నాసా అడ్మినిస్ట్రేటర్, బిలియనీర్ ఆస్ట్రోనాట్ జారెడ్ ఐజాక్‌మన్‌ను తప్పించడం కూడా ఈ సంక్షోభానికి కారణమని అంటున్నారు.
సీనియర్ స్థాయి జాబ్స్..
ఐజాక్‌మన్, ఎలన్ మస్క్ సన్నిహితుడు కావడంతో, ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీంతో నాసా ఒక స్థిరమైన నాయకత్వం లేకుండా కొనసాగుతోంది. ఇది ఉద్యోగులలో అభద్రతా భావాన్ని మరింత పెంచుతోంది. మేము మా లక్ష్యాల పట్ల కట్టుబడి ఉన్నామని నాసా ప్రతినిధి బెథనీ స్టీవెన్స్ తెలిపారు. కానీ ప్రాధాన్యతలతో కూడిన బడ్జెట్‌లో పని చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం కానున్నారు.
ఏ నాసా కేంద్రాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి?
పొలిటికో నివేదిక ప్రకారం, నాసా 10 ప్రధాన కేంద్రాలన్నీ ఈ ఉద్యోగ తొలగింపుల ప్రభావాన్ని ఎదుర్కొనున్నాయి. అయితే, మేరీల్యాండ్‌లోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో అత్యధికంగా 607 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇతర ప్రధాన కేంద్రాలలో కూడా భారీ కోతలు ఉంటాయని చెబుతున్నారు. వాటిలో
జాన్సన్ స్పేస్ సెంటర్ (టెక్సాస్): 366 ఉద్యోగులు
కెన్నెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా): 311 ఉద్యోగులు
నాసా హెడ్‌క్వార్టర్స్ (వాషింగ్టన్): 307 ఉద్యోగులు
లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ (వర్జీనియా): 281 ఉద్యోగులు
మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (అలబామా): 279 ఉద్యోగులు
గ్లెన్ రీసెర్చ్ సెంటర్ (క్లీవ్‌ల్యాండ్): 191 ఉద్యోగులు
నాసా భవిష్యత్తు ఏంటి?
ఈ ఉద్యోగ తొలగింపులు నాసా భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రధానంగా సైన్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న నాసా, ఈ కోతలతో మరింత సవాళ్లను ఎదుర్కొనుంది. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 03:32 PM