ITR Filing 2025: ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
ABN, Publish Date - Aug 11 , 2025 | 07:57 AM
మళ్లీ ఆగస్టు వచ్చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన సీజన్ ఇది. పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరు తమ ఆదాయ వివరాలు, ఖర్చులు చూపించి ITR దాఖలు చేయాలి. అయితే ఈ ఏడాది తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మళ్లీ ఆగస్టు నెల వచ్చేసింది. అంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing 2025) దాఖలు చేసే సమయం మళ్లీ వచ్చేసినట్లే. ప్రతి పన్ను చెల్లించే వ్యక్తి తన ఆదాయం, పెట్టుబడులు, మినహాయింపులు, ఖర్చులు మొదలైనవి సరిగ్గా చూపిస్తూ, పన్ను విభాగానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
ఇది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, భవిష్యత్తులో అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు కీలకమైనది. అయితే ఈసారి ITR దాఖలులో కొన్ని ముఖ్యమైన మార్పులు, శ్రద్ధ వహించాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకపోతే జరిమానాలు, జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఎవరు ITR దాఖలు చేయాలి?
మీ ఆదాయం లేదా జీతం నిర్దేశిత పరిమితిని మించితే.
భారత్‌లో లేదా విదేశాల్లో ఆస్తులు కలిగి ఉంటే.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, ESOPలు ఉంటే.
బ్యాంక్ డిపాజిట్లు రూ . 50 లక్షలకు మించితే.
సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాల్లో రూ.1 కోటి కంటే ఎక్కువ ఉంటే.
ఏడాదిలో విద్యుత్ బిల్లు రూ. 1 లక్షకు మించితే.
విదేశీ పర్యటనలకు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే.
ఆదాయంతో సంబంధం లేకుండా విక్రయాల విలువ రూ.60 లక్షలకు మించితే
ముందుగా ఏం సిద్ధం చేసుకోవాలి?
ITR దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి:
ఫారం 16: ఈ ఏడాది లేదా గతంలో ఉద్యోగం మారినట్లయితే రెండు కంపెనీల నుంచి సేకరించుకోవాలి
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్: ఈ రెండూ లింక్ అయి ఉండాలి.
పెట్టుబడి రుజువులు: బ్యాంక్ డిపాజిట్లు, PPF, ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు, హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ వంటివి.
ఈ-వెరిఫికేషన్: రిటర్న్ దాఖలు చేసిన తర్వాత 30 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లేకపోతే, రిఫండ్ ఆలస్యం కావచ్చు.
ఈ-వెరిఫికేషన్ కోసం ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్, లేదా ప్రీ-వాలిడేటెడ్ బ్యాంక్/డీమ్యాట్ ఖాతా ద్వారా EVC ఉపయోగించవచ్చు.
ITR దాఖలు గడువు ఎప్పుడు?
2024-25 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) కోసం ITR దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఇది జులై 31, 2025 నుంచి పొడిగించబడింది. కాబట్టి, ఈ తేదీని గుర్తుంచుకోండి.
గడువు తేదీ మిస్ అయితే ఏం చేయాలి?
సెప్టెంబర్ 15 గడువు మిస్ అయినా, డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ దాఖలు చేయవచ్చు. కానీ, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం రూ. 5 లక్షలకు మించితే, గరిష్టంగా రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు. ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, గరిష్టంగా రూ. 1,000 జరిమానా ఉంటుంది. ఆలస్య రిటర్న్‌లు కొన్ని పన్ను మినహాయింపులను కోల్పోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎక్కువ పరిశీలనకు గురవుతాయి. కాబట్టి, సమయానికి దాఖలు చేయడం బెస్ట్.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 11 , 2025 | 07:58 AM