ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Investment Tips: రూ.1లక్ష పెట్టుబడి.. పదవీ విరమణ టైంలో వచ్చేది రూ.1 కోటి

ABN, Publish Date - Jun 04 , 2025 | 09:01 PM

ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పవచ్చు. అవును మీరు చదివింది నిజమే. ప్రతి నెల సేవింగ్ చేసే బదులు, మీకు అందుబాటులో ఉన్న సమయంలో ఒకేసారి రూ. 1లక్ష ఇన్వెస్ట్ (Investment Tips) చేసి వదిలేస్తే, కొన్నేళ్ల తర్వాత అది మీకు కోటి రూపాయలుగా మారుతుంది. అదేలా సాధ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Investment Tips

ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు. దీనికోసం కొంత మంది నెల నెలా సేవింగ్ చేస్తే, మరికొంత మంది మాత్రం ఒకేసారి పెట్టుబడులు చేయాలని అనుకుంటారు. దీని కోసం మ్యూచువల్ ఫండ్స్‌ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు ఒకేసారి రూ.1 లక్ష ఇన్వెస్ట్ (Investment Tips) చేస్తే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఆ మొత్తం 33 ఏళ్లలోనే భారీగా పెరుగుతుంది.


ఎంతలా అంటే మీరు వార్షిక రాబడి 15% చొప్పున లక్ష ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు. ఇదేమి మ్యాజిక్ కాదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ అని చెప్పుకోవచ్చు. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత పొందాలని చూస్తున్న వారికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పలు రకాల మ్యూచువల్ ఫండ్లలో సగటున ఏడాదికి 12 శాతం నుంచి 21 శాతం వరకు రాబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో 15% రాబడి అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సగటున సాధ్యమే. కానీ దీనిలో కొంత మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది.


మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం పెద్ద మొత్తం లభిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత లక్ష రూపాయల పెట్టుబడి రూ.4 లక్షలకు చేరుకుంటుంది. 20 సంవత్సరాల తర్వాత, అది రూ.16 లక్షలకు చేరుతుంది. ఇదే లక్ష రూపాయలను మీరు 30 ఏళ్లకు తీసుకుంటే రూ.66 లక్షలు లభిస్తాయి. కానీ 33 ఏళ్లలో మాత్రం కోటి రూపాయలు లభించడం విశేషం. ఈ నేపథ్యంలో మీ వయసు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ లక్ష రూపాయలు SIPలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 60 ఏళ్ల వయసులో అంటే 33 ఏళ్ల తర్వాత కోటీకిపైగా లభిస్తుంది.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 09:03 PM