Home » Personal finance
మీరు లేదా మీ పెద్దవాళ్లకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు మర్చిపోతే.. ఇప్పుడు సులభంగా ఆ సొమ్మును పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆర్బీఐ ఉద్గమ్ అనే కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
బిడ్డలకు ఆర్థిక భద్రతను కల్పించాలనుకునే తల్లిదండ్రులు అందరూ ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా భారీ సంపదను సమకూర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఆధార్‌తో సరిగ్గా లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇది ఓటీపీల ద్వారా ఆధార్ సర్వీసెస్ సులభంగా పొందడానికి సాయపడుతుంది. ఇవి లింక్ లేకపోతే మిస్‌యూజ్ రిస్క్ పెరుగుతుంది. సర్వీసెస్‌లో సమయాభావం పెరుగుతుంది.
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం.. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ తమకు అనువైన ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. వీటిలో ఎవరికి ఏ విధానం మంచిది?
తీసుకున్న అప్పు తీర్చకుండానే రుణగ్రహీత మరణిస్తే ఏం జరుగుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అసలు ఇలాంటి విషయాల్లో పూర్తి అవగాహనతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వ్యక్తిగత లోన్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏడాదికి అడ్వాన్స్ ఇన్‌కం ట్యాక్స్ నాలుగు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత దఫా చెల్లించేందుకు డిసెంబర్ 15 చివరి తేదీ. అసలు.. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు, ఎంత మొత్తంలో చెల్లించాలి. మినహాయింపులు ఏంటి, ఎలా చెల్లించాలో ఇక్కడ చూద్దాం.
క్రమానుగత పెట్టుబడుల విషయంలో నేటి తరం చేస్తున్న తప్పు ఏమిటో వివరిస్తూ ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ నెట్టింట పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎస్‌ఐపీల వెంట పరుగులుతీస్తూ ఇతర పెట్టుబడి సాధనాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
ఏదైనాసరే చిన్నప్పటినుంచీ చేస్తే అది ఒక హాబీగా, ఆ రంగంలో నిష్ణాతులుగా మారే అవకాశం చాలా ఎక్కువ. అది సాంస్కతిక అంశాలైనా, క్రీడలైనా లేదా పొదుపు, పెట్టుబడులైనా. ఆయా అంశాల్ని చిన్నారులకు అలవాటు చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. తమ తాహతుకు మించి కార్డులు ఉపయోగించి మొత్తం బిల్లు ఒకే సారి కట్టలేక, వాటిని ఈఎంఐలలో చెల్లించేలా మార్చుకోవడం కూడా జరుగుతుంటుంది. అయితే, క్రమశిక్షణతో మెలగకపోతే మీ క్రెడిట్ ప్రొఫైల్..
ఎవరో చెప్పారని, ఎప్పుడో.. ఏదోక బ్యాంకు ఖాతాలోనో, మరో స్కీంలోనో మనీ వేస్తాం. తర్వాత వాటిని వాడ్డం మానేస్తాం. ఇలా మనం చేయొచ్చు. మన పేరెంట్స్, తాతముత్తాతలు ఎవరైనా. ఇలాంటి రూ. లక్షల కోట్ల సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతోందని మీకు తెలుసా.. అది ఇప్పుడు తీసుకోవచ్చు.