Share News

Income Tax: డిసెంబర్ 15 నాటికి మూడో దఫా అడ్వాన్స్ ఇన్‌‌కం ట్యాక్స్ చెల్లించాలా? ఇవి తెలుసుకోండి!

ABN , Publish Date - Dec 04 , 2025 | 08:03 AM

ఏడాదికి అడ్వాన్స్ ఇన్‌కం ట్యాక్స్ నాలుగు దఫాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత దఫా చెల్లించేందుకు డిసెంబర్ 15 చివరి తేదీ. అసలు.. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు, ఎంత మొత్తంలో చెల్లించాలి. మినహాయింపులు ఏంటి, ఎలా చెల్లించాలో ఇక్కడ చూద్దాం.

 Income Tax:  డిసెంబర్ 15 నాటికి మూడో దఫా అడ్వాన్స్ ఇన్‌‌కం ట్యాక్స్ చెల్లించాలా? ఇవి తెలుసుకోండి!
Advance Tax

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 4: ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అడ్వాన్స్ ట్యాక్స్ (Advance Tax) ఒక ముఖ్యమైన అంశం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో దఫా చెల్లింపులు డిసెంబర్ 15, 2025 నాటికి చెల్లించాలి. ఇది మర్చిపోతే వడ్డీలు, జరిమానాలు విధిస్తారు. ఈ విషయంలో అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు చెల్లించాలి? ఎలా లెక్కించాలి? అనే అంశాలను చూద్దాం..


కట్టాల్సిన మొత్తం పన్ను (TDS తగ్గించిన తర్వాత) రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి. సాలరీ ఉద్యోగులకైతే, జీతం తప్ప ఇతర ఆదాయాలు (ఇంటి రెంట్, వడ్డి, ఫ్రీలాన్స్, క్యాపిటల్ గెయిన్స్) ఉంటే వాటి మీద చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరు చెల్లించాలి?

వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపార సంస్థలు

ప్రొఫెషనల్స్: డాక్టర్లు, న్యాయవాదులు, కన్సల్టెంట్లు, సిఎలు, ఫ్రీలాన్సర్లు.

వ్యాపారులు: చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ట్రేడర్లు.

పెట్టుబడిదారులు: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, F&O, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, క్రిప్టో నుండి ఆదాయం వచ్చే వాళ్లు.

మినహాయింపులు:

మొత్తం పన్ను రూ.10,000 కంటే తక్కువగా ఉంటే, 60 ఏళ్లు పైబడిన నివాసితులు (వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేకపోతే), లేదా మొత్తం ఆదాయం TDS ద్వారా కవర్ అయితే మినహాయింపు దొరుకుతుంది.

ఎలా లెక్కించాలి?

మొత్తం వార్షిక ఆదాయాన్ని అంచనా వేయండి.

అర్హత కలిగిన డిడక్షన్లు (చదువు, మెడికల్, ఇన్వెస్ట్‌మెంట్స్) తగ్గించండి.

ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు వర్తింపచేసి మొత్తం పన్ను లెక్కించండి.

ఇప్పటివరకు TDS తగ్గించిన మొత్తం తీసివేయండి.

మిగిలిన మొత్తం రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, అది అడ్వాన్స్ ట్యాక్స్‌గా చెల్లించాలి.

చెల్లింపు:

ఇన్‌కమ్ ట్యాక్స్ e-ఫైలింగ్ పోర్టల్‌లో చలాన్ 280 ద్వారా ఆన్‌లైన్‌గా చేయవచ్చు.

ఆలస్యంగా చెల్లిస్తే జరిమానా

1961లోని సెక్షన్లు 234B మరియు 234C ప్రకారం, ఆలస్యం లేదా తక్కువ చెల్లింపుకు వడ్డీలు (1% నెలకు) విధించబడతాయి. సాలరీ తప్ప ఇతర ఆదాయాలను పూర్తిగా ప్రకటించండి. ఇటీవల ఈ అంశంలో ఎలాంటి మార్పులు లేవు, కానీ ప్రతి క్వార్టర్‌కు లెక్కలు చేసి చెల్లించడం మంచిది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మీ స్థితిగతుల్ని చెక్ చేయండి.

అడ్వాన్స్ ట్యాక్స్ ఏడాదికి మొత్తం నాలుగు దఫాలుగా చెల్లించాలి.. చెల్లించాల్సిన తేదీలు:

జూన్ 15: 15 శాతం

సెప్టెంబర్ 15: 45 శాతం (మొత్తం)

డిసెంబర్ 15: 75 శాతం (మొత్తం)

మార్చి 15: 100 శాతం

డిసెంబర్ 15 నాటికి 75 శాతం చెల్లించకపోతే, మిగిలిన మొత్తం మార్చి 15కి చెల్లించాలి, కానీ అదనపు రుసుములు వర్తిస్తాయి.


ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2025 | 08:06 AM