Share News

RBI Monetary Policy: రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:00 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ....

RBI Monetary Policy: రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

  • ద్రవ్యపరపతి సమీక్ష షురూ జూ రేపు నిర్ణయాల ప్రకటన జూకరెన్సీని ఆదుకునేందుకూ చర్యలు

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశంలో దేశ విదేశాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు వృద్ధిరేటు, వడ్డీరేట్ల తీరుతెన్నులపై చర్చించనుంది. శుక్రవారం మల్హోత్రా ఎంపీసీ సమావేశం నిర్ణయా లను నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే, రూపా యి రోజుకో సరికొత్త కనిష్ఠ స్థాయికి క్షీణిస్తున్న తరుణంలో ఎంపీసీ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రూపాయి పతనానికి అడ్టుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ ఈసారి సమీక్షలో ఏం చర్యలు తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరెన్సీని ఆదుకునేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందా..లేదా..? అనే అంశంపై మార్కెట్‌ స్పష్టత కోరుకుంటున్నదని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌, కరెన్సీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ జతిన్‌ త్రివేది అన్నారు. ఈ మధ్యకాలంలో రూపాయి వరుసగా క్షీణిస్తూ రావడానికి ఫారెక్స్‌ కార్యకలాపాల్లో ఆర్‌బీఐ పెద్దగా జోక్యం చేసుకోకపోవడం కూడా ఒక కారణమన్నారు. ఈ సారి సమీక్షలో కరెన్సీ పతనంపై ప్రస్తావించినప్పటికీ, డాలర్‌-రూపాయి మారకం స్థాయిపై ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యానించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూపాయి మారకం విలువకు లక్ష్యాన్నేమీ నిర్దేశించుకోలేదని మల్హోత్రా ఈ మధ్యనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం గా అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ 5.08ు క్షీణించింది. ఇండోనేషియా రూపయ్య 3.17ు, ఫిలిప్పీన్స్‌ పెసో 1.54ు, హాంకాంగ్‌ డాలర్‌ 0.18ు తగ్గాయి. వర్ధమాన మార్కెట్లలో అ త్యధికంగా పతనమైన కరెన్సీల్లో రూపాయి మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాదిలో అర్జెంటీనా పెసో 29.18ు, టర్కిష్‌ లిరా 16.69ు నష్టపోయాయి.

రెపో యథాతథమా..?

ఈ అక్టోబరులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ఠ స్థాయి 0.25 శాతానికి జారుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈసారి సమీక్షలో రెపోరేటును మరో 0.25ు తగ్గించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే ఈ సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు సైతం ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.2 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈసారి రెపోను యథాతథంగా కొనసాగించేందుకూ అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీరేట్లపై యథాతథ స్థితి, భవిష్యత్‌ రేట్లపై తటస్థ వైఖరి రెండూ పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు సైతం దోహదపడతాయని వారన్నా రు. ఈ ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ మూడు విడతల్లో రెపోరేటును ఒక శాతం తగ్గించింది.

Updated Date - Dec 04 , 2025 | 06:00 AM