Share News

బ్యాంక్ ఖాతాల్లో మర్చిపోయిన డబ్బు ఎలా తిరిగి పొందాలంటే.?

ABN , Publish Date - Feb 09 , 2026 | 06:52 PM

మీరు లేదా మీ పెద్దవాళ్లకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు మర్చిపోతే.. ఇప్పుడు సులభంగా ఆ సొమ్మును పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆర్బీఐ ఉద్గమ్ అనే కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

బ్యాంక్ ఖాతాల్లో మర్చిపోయిన డబ్బు ఎలా తిరిగి పొందాలంటే.?
unclaimed bank deposits

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 9: చాలా మంది ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఊర్లు మారినప్పుడు పాత బ్యాంక్ ఖాతాలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఇలా పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును బ్యాంకులు 'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు(Unclaimed Deposits)'గా పరిగణిస్తాయి. ఈ డబ్బును తిరిగి పొందడానికి ఆర్‌బీఐ(RBI) ఇప్పుడు ఒక అద్భుతమైన పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఏమిటీ ఉద్గమ్(UDGAM) పోర్టల్?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. UDGAM(Unclaimed Deposits Gateway to Access Information) అనే కేంద్రీకృత వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని వివిధ బ్యాంకుల్లో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి మర్చిపోయిన డబ్బు ఉందో లేదో నిమిషాల వ్యవధిలో తనిఖీ చేయవచ్చు.


డబ్బును తిరిగి పొందే ప్రక్రియ (Step-by-Step):

1. పోర్టల్‌లో నమోదు చేసుకోండి:

ముందుగా udgam.rbi.org.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. మీ మొబైల్ నంబర్, పేరుతో రిజిస్టర్ చేసుకోండి.

2. వివరాలను నమోదు చేయండి:

లాగిన్ అయిన తర్వాత, ఖాతాదారుని పేరు, కింది వాటిలో ఏదో ఒక గుర్తింపు పత్రాన్ని నమోదు చేయాలి:

  • పాన్ కార్డ్ (PAN Card)

  • ఓటర్ ఐడి (Voter ID)

  • డ్రైవింగ్ లైసెన్స్

  • లేదా పుట్టిన తేదీ వివరాలు

3. సెర్చ్ రిజల్ట్స్:

మీరు వివరాలు ఇవ్వగానే, ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ మీ పూర్వీకుల (తల్లిదండ్రులు లేదా ఇతరులు) పేరు మీద ఏవైనా డిపాజిట్లు ఉన్నా అవి ఇక్కడ బయటపడతాయి.

4. క్లెయిమ్ చేయడం ఎలా?:

డిపాజిట్ వివరాలు తెలిసిన తర్వాత, మీరు నేరుగా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అవసరమైన పత్రాలు(KYC) సమర్పించి ఆ డబ్బును మీ ప్రస్తుత ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు..

పదేళ్ల గడువు: సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లలో పదేళ్లుగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు లేకపోయినా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD) మెచ్యూర్ అయి పదేళ్లు గడిచినా ఆ సొమ్ము ఆర్‌బీఐ వారి 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్(DEA)' ఫండ్‌కు చేరుతుంది.

వారసులకు అవకాశం: ఒకవేళ అసలు ఖాతాదారుడు మరణిస్తే.. వారి వారసులు(Nominees/Legal Heirs) సరైన డెత్ సర్టిఫికేట్, ఇతర పత్రాలను సమర్పించి ఆ డబ్బును క్లెయిమ్ చేయవచ్చు.


ఇవి కూడా చదవండి..

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

Updated Date - Feb 09 , 2026 | 07:15 PM