ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Buying Tips: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

ABN, Publish Date - Jun 27 , 2025 | 07:13 AM

సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావించే వారు ముందుగా ఆరు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్స్ చెబుతున్నారు. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. ఈ జాగ్రత్తలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Home Buying Tips

ఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరికి ఈ కల నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే, ఇల్లు కొనాలనుకునే ముందు కొన్ని టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలని బ్యాంకర్స్ చెబుతున్నారు. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయితే ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు కలగకుండా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. మరి ఈ సూచనలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (Home Buying Tips).

సొంతింటి గురించి ఆలోచించేటప్పుడు ‘ఏ బడ్జెట్‌లో ఇల్లు కొనాలి’ అని చాలా మంది ఆలోచిస్తారు. ఈ ప్రశ్న తప్పని బ్యాంకర్స్ చెబుతున్నారు. మీ బడ్జెట్ ఎంతనే విషయంలో ఓ అంచనాకు వచ్చాక ఇళ్ల కొనుగోలు ప్రయత్నాలు మొదలెట్టాలి. సొంతిల్లు భారం కాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి.

ఎంత మేరకు లోన్ లభిస్తుంది అని ప్రశ్నించే బదులు ఎంత మొత్తం వరకూ లోన్ భారం కాదు అన్న ప్రశ్న వేసుకుని అందుకు అనుగుణంగా రుణం తీసుకోవాలి. కుటుంబసభ్యుల మద్దతు, వారసత్వ ఆస్తులు లేని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మీరు కొనబోయే ఇంటి ధర గరిష్ఠంగా మీ వార్షిక ఆదాయానికి ఐదు రెట్లు ఉండొచ్చు. ఇంతకు మించిన ధర భారంగా మారుతుందని మరవొద్దు

ఇక నెలనెలా చెల్లించే ఈఎమ్‌ఐ వాటా నెలవారీ జీతంలో గరిష్ఠంగా 35 శాతం ఉండొచ్చు. ఈ లిమిట్ దాటితే మాత్రం ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడం కష్టం. జీవితం తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఇంటి ధరలో దాదాపు సగం మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇది డౌన్ పేమెంట్‌కు ఉపయోగపడటంతో పాటు ఇంటి కొనుగోలు తరువాత కూడా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది.

ఇంటి కోసం దాచిన సొమ్మును 35:15 నిష్ఫత్తిలో విభజించి అందులో మొదటి భాగాన్ని ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్‌గా వాడుకోవాలి. మిగతా భాగాన్ని నగదు రూపంలో అత్యవసర అవసరాల నిమిత్తం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ సూత్రానికి ఎటువంటి మినహాయింపులు లేవు.

కనీసం ఐదేళ్ల పాటు ఒకే చోట ఉండాలనుకునే వారు మాత్రం సొంతింటి కోసం ప్రయత్నించాలి. ఇంతకంటే తక్కువ సమయానికి అద్దె ఇల్లే బెటర్. స్వల్పకాలానికి ఇల్లు కొనుగోలు చేస్తే చివరకు నష్టాలే మిగులుతాయి. ట్రాన్సాక్షన్ ఖర్చులు, వడ్డీలు, ఇంటి విలువలో ఎగుడుదిగుడులు వంటివన్నీ నష్టాలకు కారణమవుతాయి.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 07:26 AM