ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SBI Home Loans: వావ్, హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. జూన్ 15 నుంచి అమలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 09:13 PM

హోం లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో జూన్ 15, 2025 నుంచి హోమ్ లోన్ (SBI Home Loans) వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలిపింది.

SBI Home Loans

ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేసుకోవాలంటే హోం లోన్ (SBI Home Loans) తప్పనిసరి అని చెప్పవచ్చు. అలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంచి వార్త చెప్పింది. తాజా మార్పులతో SBI హోం లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. డ్రీం హౌస్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. జూన్ 15, 2025 నుంచి హోమ్ లోన్ వడ్డీ రేట్లను 0.50% తగ్గించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటించిన రెపో రేటు తగ్గింపును అనుసరిస్తూ SBI ఈ నిర్ణయం తీసుకుంది.

రుణం తీసుకున్న వారికి

దీనివల్ల కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికే కాకుండా ఇప్పటికే రుణం తీసుకున్న వారికి సైతం నెలవారీ చెల్లింపుల భారం కొంత తక్కువ కానుంది. తమ ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారికి ఇది ఒక సంతోషకరమైన వార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, UCO బ్యాంకులు ఇప్పటికే లోన్స్ తీసుకున్న, కొత్త వారికి రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం HDFC, ICICI బ్యాంక్ వంటి రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రమే తమ రేట్లను తగ్గించలేదు.

SBI హోమ్ లోన్ (SBI Home Loans) రేట్లు కొత్త మార్పులు

  • బయోస్ రేటు (EBLR): 8.65% నుంచి 8.15%కి తగ్గింపు

  • హోమ్ లోన్ వడ్డీ రేట్లు: 7.50% నుంచి 8.45% వరకు, ఇది రుణ పరిమాణం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మారుతుంది

  • ఈ మార్పులు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం లోన్స్ తీసుకున్న వారు కూడా ఈ తగ్గింపుల ప్రయోజనాలను పొందవచ్చు

EMI లెక్కలపై ప్రభావం

ఉదాహరణకు రూ. 20 లక్షల రుణం 20 సంవత్సరాల కాలానికి తీసుకున్నట్లయితే, వడ్డీ రేటు 0.50% తగ్గడం వల్ల నెలవారీ EMI సుమారు రూ. 1,000 వరకు తగ్గనుంది. రుణ పరిమాణం పెరిగే కొద్దీ EMI తగ్గింపు కూడా పెరుగుతుంది.

ఇతర బ్యాంకుల పరిస్థితి

SBIతో పాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రెపో రేటు తగ్గింపును అనుసరించి తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇవి రుణాలు తీసుకున్న వారికి మరింత ఆర్థిక ఊరటను కలిగిస్తాయి. ఈ మార్పులు హోం లోన్స్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తాయి. మీరు మరింత సమాచారం కోసం SBI అధికారిక వెబ్‌సైట్‌ లేదా మీ సమీప బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 09:18 PM