Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
ABN, Publish Date - May 17 , 2025 | 06:25 AM
Gold And Silver Rate: హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 95130 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71350 దగ్గర ట్రేడ్ అయింది.
పసిడి ప్రియులకు ఊరటనిచ్చేలా గత కొంతకాలం నుంచి బంగారం ధరలు తగ్గతూ వచ్చాయి. నెల క్రితం లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 93 వేలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 90 దిగువన ట్రేడ్ అవుతోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలనుకున్న వారు షాపులకు ఎగబడ్డారు. మరికొంతమంది మాత్రం బంగారం ఇంకా కొంచెం తగ్గితే తీసుకుందామని అనుకున్నారు. అయితే, ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. బంగారం ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 95130 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71350 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 95140 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87210 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71360 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో వెండి ధరలు ప్రతీ నిత్యం తగ్గుతూ వెళుతున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు స్థిరంగా తగ్గుతున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర 10800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10790 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,07,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
Kamanchi Leaves Benefits: మంచి చేసే కామంచి
Jiya Autism Story: అమ్మ వేసిన గెలుపు బాట
Updated Date - May 17 , 2025 | 06:35 AM