ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold And Silver Rate: బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..

ABN, Publish Date - Jul 13 , 2025 | 07:13 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది

Gold And Silver Rate

బంగారం ధరలు భయపెడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ లక్షకు చేరువవుతోంది. ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన బంగారం ధర లక్షకు చేరింది. ధర మరింత పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలతో కొన్ని రోజులకే బంగారం ధరలు పడిపోయాయి. జూన్ చివరల్లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా పడిపోయింది. 94 వేల దగ్గర ట్రేడ్ అయింది. పేద, మధ్య తరగతి వాళ్లు హమ్మయ్య అనుకునేలోపు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా ..

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,500 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,25,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి.. 100 గ్రాముల వెండి ధర నేడు 12,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,25,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమే...

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Updated Date - Jul 13 , 2025 | 07:13 AM