ఆ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమే...
ABN , Publish Date - Jul 13 , 2025 | 07:05 AM
ఆ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమేనని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారని, కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా.. చివరకు పూర్తి చేస్తారని తెలుపుతున్నారు. ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
అనుగ్రహం
13 - 19 జూలై 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. అనుకూలతలు అంతంత
మాత్రమే. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరు స్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకే స్తారు. ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
మీ కష్టం వృథా కాదు. శ్రమించే కొద్దీ ఫలితాలుంటాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మెల గండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి, నిర్దేశిత లక్ష్యం రూపొందించుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అను మానాలు, అపోహలకు తావివ్వవద్దు. పలుకు బడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారంఉంది. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. అవకాశాలు అందినట్టే అంది చేజారి పోతాయి. మిత్రుల వ్యాఖ్యలు ఉత్తేజపరు స్తాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమిం చాలి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకో వద్దు. సొంత నిర్ణయాలు తగవు. ఆచితూచి అడుగేయండి. ఊహించని ఖర్చు ఎదురవు తుంది. సాయం ఆశించి భంగపడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. ఒంటెద్దు పోకడ తగదు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్ప థంతో మెలగండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. చేసిన పనులే చేయ వలసి వస్తుంది. రోజువారీ ఖర్చులేఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
సర్వత్రా అనుకూలం. తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడ తారు. ఫైనాన్సు, చిట్స్ రంగాలకు దూరంగా ఉండండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగి స్తుంది. మీ చొరవతో ఒకరికి మేలు జరుగు తుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కొత్త యత్నాలు మొదలుపెడ తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. తలపెట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆత్మస్థైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. అవకాశా లను తక్షణం అందిపుచ్చుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు, పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పత్రాల్లో సవరణలు అని వార్యం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. వేడుకకు హాజరవుతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఓర్పుతో మెలగండి. ఈ సమ స్యలు తాత్కాలికమే. త్వరలోపరిస్థితులు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగు తుంది. వివాహయత్నాలు సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వ్యవహారజయం ఉంది. అను కున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీ యమవుతుంది. వ్యతిరేకులనుఆకట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. కొత్త పనులకు ప్రణాళికలు వేసు కుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఇతరుల విషయాలల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కీలక వ్యవహారాలపైౖ పట్టు సాధిస్తారు. అన్నింటా మీదే పైచేయి. వ్యవహా రాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపు తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పనులు సానుకూలమవుతాయి. అతిగా శ్రమించవద్దు. విందులకు హాజరవు తారు. బంధుత్వాలు బలపడతాయి. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News