Advance Tax Deadline: పన్ను చెల్లింపు లాస్ట్ డేట్ జూన్ 15 ఆదివారం.. మండే చెల్లించవచ్చా..
ABN, Publish Date - Jun 14 , 2025 | 02:50 PM
దేశంలో పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే అడ్వాన్స్ పన్ను చెల్లింపు చివరి తేదీ ఈసారి జూన్ 15న ఆదివారం వచ్చింది. దీంతో సండే కూడా చెల్లింపులు చేసుకోవచ్చా, లేదంటే మండే జూన్ 16న చేసుకోవచ్చా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ: దేశంలో ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాల్సిందే. కానీ పన్నుల చెల్లింపు తేదీ (Advance Tax Deadline) చివరి రోజు ఆదివారం వస్తే ఎలా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది జూన్ 15, 2025 ఆదివారం వచ్చింది. దీంతో అడ్వాన్స్ టాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ జూన్ 16న చెల్లించవచ్చా లేక పెనాల్టీ పడుతుందా? అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు అందరూ దీని గురించి అడుగుతున్నారు. ఇది సాధారణమైన సందేహమే అయినా, అసలు సండే వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సండే వచ్చిన వేళ
అంటే జూన్ 15, 2025 ఆదివారం వచ్చినందున జూన్ 16 (సోమవారం) పన్ను చెల్లించినా పెనాల్టీ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేశ్ సురానా కూడా ధృవీకరించారు. సర్క్యూలర్ నెం. 676 ప్రకారం ఏదైనా టాక్స్ డ్యూ డేట్ ఒక పబ్లిక్ హాలిడే రోజు వస్తే, తదుపరి రోజును అధికారిక గడువు తేదీగా పరిగణించవచ్చు. దీంతో జూన్ 15న ఆదివారం కావడంతో, జూన్ 16న సోమవారం అడ్వాన్స్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఎలాంటి పెనాల్టీ ఉండదు.
అడ్వాన్స్ టాక్స్ ఎవరికీ, ఎందుకు? (Advance Tax Deadline)
అడ్వాన్స్ టాక్స్ అనేది వార్షిక పన్ను భారం అధికంగా ఉండే వ్యక్తులకు వర్తించేది. అంటే సంవత్సరానికి రూ.10,000 కన్నా ఎక్కువ పన్ను బాకీ ఉన్నవారు (ఉద్యోగులు, వ్యాపారులు, స్వతంత్ర వృత్తిదారులు) ఈ పన్నును నాలుగు విడతలుగా చెల్లించాలి. అంటే ముందుగా 15 శాతం జూన్ 15లోగా చెల్లించాలి. అంటే 16న కూడా చెల్లించుకోవచ్చు. మిగతా 45% సెప్టెంబర్ 15 వరకు, మరో 75% డిసెంబర్ 15 వరకు, 100% మార్చి 15లోపు చెల్లించుకోవాలి. కానీ మొదటి విడత మిస్ అయితే Section 234C ప్రకారం పన్నుపై 1% వడ్డీ వసూలు చేస్తారు.
చెల్లించకపోతే ఏం జరుగుతుంది..
అంటే, ఆదివారం వచ్చినందున పన్ను చెల్లింపునకు సోమవారం వరకూ గడువు ఉంది. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. కానీ, మీ బ్యాంక్ లేదా మీ ట్యాక్స్ పోర్టల్ ఆదివారం కూడా పని చేస్తే మీరు అప్పుడే పేమెంట్ చేసుకోవచ్చు. చెల్లింపులు సమయానికి చేయడం వల్ల మీరు అదనపు వడ్డీ లేదా రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. అడ్వాన్స్ టాక్స్‌ను సమయానికి చెల్లించడం వల్ల మీరు మిగతా సంవత్సరంలో ప్రశాంతంగా ఉండవచ్చు. నోటీసుల గొడవ లేకుండా జీవించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్ మరింత ఈజీ
For National News And Telugu News
Updated Date - Jun 14 , 2025 | 03:36 PM