Telangana Infrastructure Projects: తెలుగు రాష్ట్రాలపై బెంట్లే సిస్టమ్స్ దృష్టి
ABN, Publish Date - Jul 19 , 2025 | 04:47 AM
అమెరికాకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ బెంట్లే సిస్టమ్స్.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ బెంట్లే సిస్టమ్స్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లపై దృష్టి సారించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాల్లో రవాణా, అర్బన్ ప్లానింగ్, పారిశ్రామిక, ఇంధన రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతూ వస్తున్నాయని, ఈ రంగాలకు అవసరమైన సొల్యూషన్లను అందించటంలో బెంట్లే ఇప్పటికే కీలకంగా ఉందని సంస్థ రీజినల్ ఎగ్జిక్యూటివ్ (దక్షిణాసియా) కమలకన్నన్ తిరువాది తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రైల్వే, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయ ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి సారించటంతో తాము కూడా ఈ విభాగాల్లో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటుతో పాటు మెట్రో రైల్ నెట్‌వర్క్ విస్తరణ, రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటం కూడా బెంట్లే సిస్టమ్స్‌కు కలిసి రానుందన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 19 , 2025 | 04:47 AM