Sania Chandok Property: సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ సంపాదన, ఆస్తి ఎంతో తెలుసా..
ABN, Publish Date - Aug 14 , 2025 | 01:07 PM
బాలీవుడ్, వ్యాపార రంగాల్లో నిత్యం ఏదో కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్‌కి, ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే సానియా వృత్తి ఏంటి? ఎంత సంపాదిస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన నిశ్చితార్థం వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అర్జున్ ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసిన సచిన్ అభిమానులు సానియా గురించి, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. సానియా చందోక్ ఎవరు, ఆమె ఏం చేస్తుంది, ఎంత సంపాదిస్తారనే (Sania Chandok Property) విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సానియా చందోక్ ఏం చేస్తారు
సానియా చందోక్‌కి పెంపుడు జంతువులంటే ఇష్టం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన సానియా, చదువు తర్వాత తన ప్యాషన్‌ను ఫాలో అయింది. ఆమె ముంబైలో మిస్టర్ పావ్స్ పెట్ స్పా & స్టోర్ LLP అనే లగ్జరీ పెట్ స్పాను స్థాపించింది. ఈ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు సేవలను అందిస్తుంది. గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఇది భారత్‌లో మొదటి లగ్జరీ పెట్ స్పా అని చెప్పొచ్చు.
రెండు బ్రాంచ్‌లు
ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ. 90 లక్షలు. ప్రస్తుతం ముంబైలో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. సానియా స్వయంగా షాప్‌లో పెంపుడు జంతువులతో టైమ్ స్పెండ్ చేస్తూ, వాటిని ప్రేమగా చూసుకుంటుంది. ఆమె వరల్డ్‌వైడ్ వెటర్నరీ సర్వీస్ (WVS) ABC ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసి, సర్టిఫైడ్ టెక్నీషియన్‌గా మారింది.
సానియా ఫ్యామిలీ విషయానికి వస్తే?
సానియా చందోక్ ముంబైలోని ఓ పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత రవి ఘాయ్ గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ లాంటి బ్రాండ్‌లను నిర్వహిస్తోంది. అంతేకాదు, ముంబైలోని ఇంటర్ కాంటి నెంటల్ హోటల్ కూడా వీళ్లదే. ఈ గ్రూప్ 2023-24లో రూ. 624 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ. ఆహారం, ఆతిథ్య రంగంలో వీళ్ల సామ్రాజ్యం కొనసాగుతోంది.
కానీ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. సానియా తండ్రి గౌరవ్ ఘాయ్‌కి తన తండ్రి రవి ఘాయ్‌తో కొన్ని కుటుంబ వివాదాలు ఉన్నాయి. అయినా సానియా తన కెరీర్‌లో ఫోకస్ చేసి, తన సొంత మార్గంలో సక్సెస్ సాధిస్తోంది.
అర్జున్ టెండూల్కర్ క్రికెట్ జర్నీ
అర్జున్ టెండూల్కర్, సచిన్ కుమారుడిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. గోవా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు, IPLలో ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. కానీ, అతను ఇంకా తన తండ్రిలాంటి మ్యాజిక్ చూపించలేకపోయాడు. ఎక్కువ సమయం బెంచ్‌పై గడిపినా, అతను కష్టపడుతూనే ఉన్నాడు. అర్జున్ ముంబై నుంచి కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత గోవాకు మారాడు.
సానియా, అర్జున్ ఎలా కలిశారు?
సానియా, అర్జున్ చాలా కాలంగా ఒకరినొకరు తెలుసు. వీళ్ల కుటుంబాలు ఒకరికొకరు దగ్గరగా ఉంటాయి. సానియాకి.. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్. సారా ద్వారానే సానియా, అర్జున్‌కి పరిచయం అయ్యారు. రెగ్యులర్‌గా కలుసుకుంటూ వీళ్ల స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు సారా తన బెస్ట్ ఫ్రెండ్‌ని తన సోదరుడికి వధువుగా చూస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 14 , 2025 | 01:12 PM