Fruits to avoid for Durga Maa: నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఈ పండ్లను అస్సలు సమర్పించకండి
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:28 AM
నవరాత్రి సమయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఈ పండ్లను అస్సలు సమర్పించకూడదు.
ఇంటర్నెట్ డెస్క్: నవరాత్రి సమయంలో దుర్గాదేవిని పూజించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం ఒక సంప్రదాయం. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిమ్మ, మామిడి, సీతాఫలం సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
నవరాత్రి సమయంలో, తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రకాల రూపాల్లో పూజిస్తారు. ప్రతిరోజూ దుర్గాదేవి ప్రత్యేక రూపాన్ని పూజించడం, ఆమెకు ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ఆచారం. నవరాత్రి సమయంలో, పూజలో మాత్రమే కాకుండా తినే ఆహారంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ తొమ్మిది రోజులలో, ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉండాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం అస్సలు తీసుకోకూడదు.
ఈ పండ్లను అస్సలు సమర్పించకండి
నవరాత్రి సమయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పొరపాటున కూడా నిమ్మకాయ, చింతపండు, ఎండు కొబ్బరి, పియర్ పండ్లు, అత్తి పండ్లు, కుళ్ళిన పండ్లను నైవేద్యంగా అస్సలు సమర్పించకూడదు. ఎందుకంటే వీటిని శుభప్రదంగా పరిగణించరు.
అంతేకాకుండా, అమ్మవారికి తెచ్చిన పండ్లను ఎట్టిపరిస్థితిలోనూ ఇతరులకు ఇవ్వకూడదు.
నైవేద్యంగా సమర్పించిన పండ్లను తర్వాత ప్రసాదంగా ఇవ్వవచ్చు.
ఈ పండ్లను దేవతకు సమర్పించండి:
దానిమ్మ, మామిడి, సీతాఫలం, పుచ్చకాయ వంటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చాలా ప్రయోజనకరం. ఈ పండ్లను సమర్పించడం ద్వారా జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతారు.
Also Read:
వంటగదిలో నూనె, జిడ్డు మరకలను తొలగించే నేచురల్ చిట్కాలు ఇవే.!
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
For More Latest News
Updated Date - Sep 30 , 2025 | 11:32 AM