ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur : యువకుడి అనుమానాస్పద మృతి

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:39 AM

అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి సమీపంలోని నాగిరెడ్డిపల్లి రస్తా వద్ద రైలుపట్టాలపై ఆదివారం ఉదయం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి(25) మృతదేహం లభ్యమైంది.

  • రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుల వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు

అనంతపురం న్యూటౌన్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి(25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి సమీపంలోని నాగిరెడ్డిపల్లి రస్తా వద్ద రైలుపట్టాలపై ఆదివారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. ఈ యువకుడు తోపుదుర్తికి చెందిన మల్లిరెడ్డి కుమారుడని రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్‌, ఏఎ్‌సఐ రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పిలిపించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సోదరులు, అనుచరుల వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మల్లిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. ఉమామహేశ్వర రెడ్డి తోపుదుర్తి సోదరులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటారు. దీంతో వైసీపీ హయాంలో వారు ఒకసారి పిలిపించి మందలించినట్లు తెలిసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అనంతపురంలో నివాసం ఉం టున్నాడు. ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. తన స్నేహితుడితో కలిసి సోములదొడ్డి ప్రాంతానికి శనివారం రాత్రి వెళ్లిన ఉమామహేశ్వరరెడ్డి, కాసేపటి తర్వాత అతన్ని వెనక్కి పంపినట్లు తెలిసింది. తెల్లవారేసరికి రైల్వేట్రాక్‌పై మృతిచెంది కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 27 , 2025 | 05:39 AM