Home » Anathapuram
అనంత నగరం జలమయమైంది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లోని రోడ్లల్లో, వీధుల్లో పెద్దఎత్తున నీరు చేరాయి.. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
తొలగించిన తమ పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. మండలంలోని పింఛన తొలిగిస్తున్నట్లు 370 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో దివ్యాంగులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై సోమవారం మండలకేంద్రానికి తరలివచ్చి అనంతపురం - తాడిపత్రి రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. స్థానిక గణేనాయక్ భవనలో ఆదివారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన జిల్లా 8వ మహాసభకు ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
లుక్ అంటూ ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. తాము పంపే లింక్‌ను ఓపెన్ చేసి కొన్ని సెకన్లపాటు చూస్తే ఒక్కో లింక్‌కు రూ.15 ఇస్తామంటూ ఆశ రేపింది.
అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.
భూ తగాదాలో జరిగిన ఘర్షణ తీవ్రంగా మారి దంపతుల హత్యకు దారి తీసింది. వేట కొడవళ్లతో దాడి జరిగి భార్య అక్కడికక్కడే, భర్త ఆసుపత్రిలో మృతి చెందారు.
ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవంలో విద్యార్థులు ఏఐ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 19 ఏళ్ళుగా పనిచేస్తున్నామని... పనిఒత్తిడి తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డ్వామా ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూభవనలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.
తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.