Share News

City.. Watershed నగరం.. జలమయం

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:52 AM

అనంత నగరం జలమయమైంది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లోని రోడ్లల్లో, వీధుల్లో పెద్దఎత్తున నీరు చేరాయి.. కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.

City.. Watershed నగరం.. జలమయం

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అనంత నగరం జలమయమైంది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లోని రోడ్లల్లో, వీధుల్లో పెద్దఎత్తున నీరు చేరాయి.. కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.


హనుమానకాలనీ, రజకనగర్‌, గౌరవ గార్డెన, జనశక్తి నగర్‌, రంగస్వామి నగర్‌, శాంతినగర్‌, గంగానగర్‌, బిందెలకాలనీ, ఉ మానగర్‌ మరువవంకబ్రిడ్జి, నడిమివంకలలో పర్యటించారు. స్థానికులతో మాట్లా డి పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరువవంకలో ప్లాస్టిక్‌ వస్తువులు, చెత్త చేరడం తో ఉమానగర్‌ బ్రిడ్జి వద్ద ఎక్సవేటర్లతో తొలగించారు. ఇక ప్రధాన రహదారు లు, వీధులు వర్షం నీటితో మడుగుల్లా మారాయి. దీంతో నగరవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారుల వెంట ఏఎంసీ ఈఈలు చంద్రశేఖర్‌, షాకీర్‌, ఎంహెచఓ నరసింహులు, డీఈ సత్యనారాయణ, ఏఈలు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 24 , 2025 | 12:52 AM