Share News

అంగన్వాడీలకు కనీసం వేతనం ఇవ్వాలి : సీఐటీయూ

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:03 AM

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. స్థానిక గణేనాయక్‌ భవనలో ఆదివారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన జిల్లా 8వ మహాసభకు ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అంగన్వాడీలకు కనీసం వేతనం ఇవ్వాలి : సీఐటీయూ

అనంతపురం టౌన, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. స్థానిక గణేనాయక్‌ భవనలో ఆదివారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన జిల్లా 8వ మహాసభకు ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


ఎఫ్‌ఆర్‌ఎ్‌సను, లబ్ధిదారుల ఫేస్‌ క్యాప్చర్‌ను రద్దు చేసి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అంగన్వాడీల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపుంర వార్తల కోసం...

Updated Date - Aug 18 , 2025 | 01:04 AM