పోలీసుల తీరును నిరసిస్తూ.. సెల్ టవర్ ఎక్కి నిరసన..
ABN , Publish Date - Jan 26 , 2026 | 10:38 AM
తన కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడు పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొత్తచెరువుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళితే..
శ్రీ సత్యసాయి జిల్లా: కొత్తచెరువు(Kothacheruvu)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సెల్ టవర్ (Cell tower) ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా కలకలం రేపింది. తన అల్లుడిపై పోలీస్ స్టేషన్ (Police station)లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు లక్ష్మీనారాయణ. ఇటీవల తన కుమార్తె నుంచి విడాకులు తీసుకున్న అల్లుడు.. పెళ్లి సమయంలో తాము ఇచ్చిన బంగారం(Gold) తిరిగి ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మీనారాయణ. అతని నుంచి తమకు బంగారం ఇప్పించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తమ ఫిర్యాదు పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీ నారాయణ కూతురు శ్రావణి తెలిపింది.
సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. న్యాయం చేస్తామని, కిందకు దిగాలని ఆయనకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఐ మారుతి శంకర్‌తో వాగ్వాదానికి దిగారు లక్ష్మీనారాయణ కూతురు శ్రావణి. సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
గణతంత్ర దినోత్సవం వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత..
భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?