గణతంత్ర దినోత్సవం వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత..
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:41 AM
గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు బయటపడటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: గణతంత్ర దినోత్సవం(Republic Day) వేళ రాజస్థాన్(Rajasthan) కలకలం రేగింది. నాగౌర్ జిల్లాలో ఓ పొలం నుంచి భారీఎత్తున పేలుడు పదార్థాలను(Explosives) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు రోజులు నిఘా ఉంచి.. పక్కా సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 187 బస్తాల్లో ప్యాక్ చేసి ఉంచిన 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్(Ammonium nitrate)ను పొలం నుంచి స్వాధీనం చేసుకున్నామని నాగౌర్ ఎస్పీ మృదుల్ కవాచా తెలిపారు.
గణతంత్ర వేడుకల పరేడ్ల సమయంలో దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఒకరికి ఉగ్రవాద (terrorism) సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో భారీ కుట్రను భగ్నం చేయగలిగామని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ (CM Bhajan Lal Sharma) పోలీసులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు
Read Latest National News