Share News

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:40 PM

నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..
ACB Raids

నెల్లూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు (ACB Raids) ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. మద్యం వ్యాపారులకు సంబంధించిన విషయంలో నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ (HC) రామ్మోహన్ రాజు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. మద్యం వ్యాపారుల దగ్గరి నుంచి సీఐ బాబీ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సీఐ ఆదేశాల మేరకు బాధితుల నుంచి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.


అదుపులో సీఐ..

లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్‌తో పాటు, దీనికి ప్రధాన కారకుడైన సీఐ బాబీని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు నాయుడుపేట పోలీస్ స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్నారు. సీఐ బాబీతో పాటు ఈ వ్యవహారంలో మరికొంతమంది సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఆకస్మిక దాడితో జిల్లాలోని మిగిలిన పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 10:02 PM