ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan Sattenapalli Tour: జగన్ సత్తెనపల్లి పర్యటన వల్ల మరొకరు బలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 08:29 PM

YS Jagan Sattenapalli Tour: 22 ఏళ్ల తెల్లజర్ల మధు కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మధును పరీక్షించిన వైద్యులు అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ధ్రువీకరించారు.

YS Jagan Sattenapalli Tour

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన వల్ల మరొకరు బలయ్యారు. జగన్ ర్యాలీ కారణంగా సకాలంలో వైద్యం అందక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 18వ తేదీన సత్తెనపల్లికి చెందిన 22 ఏళ్ల తెల్లజర్ల మధు కళ్లు తిరిగిపడిపోయాడు. దీంతో అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మధును పరీక్షించిన వైద్యులు అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లమని సూచించారు. ఈ నేపథ్యంలోనే అంబులెన్సులో మధును గుంటూరుకు తరలిస్తూ ఉన్నారు.

అయితే, సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల ర్యాలీలో మధు ఉన్న అంబులెన్స్ ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు గంట సేపు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందక మధు చనిపోయాడు. కాగా, అదే రోజు వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్య కూడా చనిపోయాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు సింగయ్య తలను తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దీంతో ఆయన చనిపోయాడు. ఈ కేసులో కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మగాళ్లను టార్గెట్ చేసి.. తల్లీకూతుళ్ల మోసం..

ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఆకాశాన్ని అంటిన పొగ..

Updated Date - Jun 23 , 2025 | 08:43 PM