Share News

Israel Iran War: ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఆకాశాన్ని అంటిన పొగ..

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:06 PM

Israel Iran War: న్యూక్లియర్ బాంబుల తయారీనే ఇరాన్ కొంపముంచింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండటం తమకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. అణు బాంబుల తయారీని అడ్డుకోవడానికి 10 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై వైమానిక దాడులు చేసింది.

Israel Iran War: ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఆకాశాన్ని అంటిన పొగ..
Israel Iran War

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. గత కొన్ని రోజులనుంచి రెండు దేశాలు మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. సోమవారం మధ్యాహ్నం ఏకంగా టెహ్రాన్ సిటీపై ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడులు చేసింది. రక్షణ సంస్థలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్‌కు సంబంధించిన రక్షణ సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్, పోలీస్ ఇంటెలిజెన్స్ యూనిట్స్‌పై మిస్సైల్స్ దాడులు జరిగాయి.


ఈ దాడులకు సంబంధించిన వీడియోను ఇరాన్ అధికారిక మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో బాంబు ప్రభావం తాలూకా భీకర దృశ్యాలు ఉన్నాయి. పొగ ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. కొన్ని వందల మీటర్ల పరిధి మొత్తం పొగతో నిండిపోయింది. టెహ్రాన్‌లోని రక్షణ సంస్థలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఎంత మంది గాయపడ్డారు.. ఎంత మంది చనిపోయారు అన్న విషయం తెలియరాలేదు. అల్ జజీరా కథనం ప్రకారం.. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ముందుగానే చెప్పారు.


తాము టెహ్రాన్‌లో దాడులు చేస్తున్నామని చెప్పారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. కాగా, న్యూక్లియర్ బాంబుల తయారీనే ఇరాన్ కొంపముంచింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండటం తమకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. అణు బాంబుల తయారీని అడ్డుకోవడానికి 10 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై వైమానిక దాడులు చేసింది. అప్పటినుంచి యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. నిన్న ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసింది.


ఇవి కూడా చదవండి

బై ఎలక్షన్‌లో గెలుపు.. విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి

రైలులో ఎమ్మెల్యే దౌర్జన్యం.. సీటు మార్చుకోలేదని..

Updated Date - Jun 23 , 2025 | 07:29 PM