ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

ABN, Publish Date - Apr 20 , 2025 | 06:30 PM

వైసీపీ అధికారం కోల్పోయినా.. ఆ పార్టీలోని పలువురు చోటా మోటా నేతలు తమ అరాచకాలను వీడడం లేదు. ఈ నేతల.. ఈ తరహ చర్యలు ఒక్క జిల్లాకు పరిమితం కాలేదు.

YCP Flags

అమరావతి, ఏప్రిల్ 20: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రనాయకులే కాదు..చోటా మోటా నాయకులు సైతం అడ్డూ ఆపు లేకుండ రెచ్చిపోయారు.ఇంకా చెప్పాలంటే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రమే కాదు.. ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఇదే పంథా కొనసాగించారు.

ఈ నేపథ్యంలో 2024 మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. దీంతో వైసీపీ ప్రతిపక్షానికి కూడా పరిమితం కాలేదు.

అయితే వైసీపీ నేతలు మాత్రం తమ పాత పంథాను వీడ కుండా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. అందుకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వారు చేస్తున్న అరాచకాలు ఏ విధంగా ఉన్నాయనేందుకు తాజా ఉదాహరణలు..


ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లిలో జిలెటెన్ స్టిక్స్‌ను భారీగా డంప్ చేసిన వైసీపీ మండల నేత హనుమంతరావుతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొణిదెనతోపాటు నాగరాజుపల్లిలో ఐదు వేల కేజీల జిలెటెన్ స్టిక్స్‌తోపాటు బొలెరో, అశోక్ లేలాండ్ వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రానైట్ క్వారీల్లో బ్లాస్టింగ్‌కి ఉపయోగించే జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లను అక్రమంగా గూడౌన్‌లో నిల్వ ఉంచినట్లు హనుమంతరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. పోలీసులు ఆ యా గౌడన్లపై దాడి చేసి జిలెటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.


ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఇద్దరు క్రికెట్ బుకీలు.. వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ, అతడి సోదరుడు యడ్ల నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, రెండు లాప్‌టాప్‌లు, 10 సెల్ ఫోన్లతోపాటు రూ.33 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసాపురండీఎస్పీ శ్రీవేద వెల్లడించారు. గత పదేళ్లుగా వీరు క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తెలిందని తెలిపారు.

ఇది కూడా చదవండి..

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 06:30 PM