మహిళా సాధికారతే లక్ష్యం: పీతల సుజాత
ABN, Publish Date - May 23 , 2025 | 06:56 AM
పీతల సుజాత రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహిళల ఆర్థిక సాధికారతే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతల స్వీకరణ
గుంటూరు, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పని చేస్తుందని ఆ సంస్థ నూతన చైర్‌పర్సన్ పీతల సుజాత చెప్పారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో సంస్థ నూతన చైర్‌పర్సన్‌గా పీతల సుజాత పదవి బాధ్యతలు చేపట్టారు.
Updated Date - May 23 , 2025 | 06:56 AM