Welfare NEET Boost: కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ విద్యాసంస్థలు
ABN, Publish Date - May 08 , 2025 | 05:43 AM
సంక్షేమ గురుకులాల స్థాయిని కార్పొరేట్ విద్యాసంస్థలతో సమానంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రులు తెలిపారు. నీట్ ఉచిత కోచింగ్ సెంటర్లను 10కి పెంచనున్నట్లు ప్రకటించారు
నీట్ ఉచిత కోచింగ్ సెంటర్లను 10కి పెంచుతాం: డోలా, సంధ్యారాణి
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమశాఖ గురుకులాలు, హాస్టళ్లు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఉన్నాయని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, టీచర్లకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నగదు బహమతులు, మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తొలిసారిగా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. నీట్‌లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతామన్నారు. గిరిజన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం గర్వకారణమన్నారు. టీచర్స్‌ను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
Updated Date - May 08 , 2025 | 05:43 AM