ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీ

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:56 AM

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి బదిలీల ప్రక్రియ చేపడుతూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 30లోగా హేతుబద్దీకరణ, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

  • సొంత మండలంలో పనిచేయకూడదని నిబంధన

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి బదిలీల ప్రక్రియ చేపడుతూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 30లోగా హేతుబద్దీకరణ, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మార్గదర్శకాల ప్రకారం.. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సిబ్బందిని తప్పకుండా బదిలీ చేస్తారు. ఐదేళ్లు పూర్తి కాని వారు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సిబ్బంది ఇకపై సొంత మండలంలో పనిచేయరాదు. బదిలీలు పూర్తయిన తర్వాత ఎవరైనా సిబ్బంది అదనంగా ఉంటే అక్కడే కొనసాగుతారు. బదిలీల్లో దృష్టి లోపం, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పైబడి సర్వీసు పూర్తిచేసిన వారికి, 40ు పైబడి వైకల్యం ఉన్న వారికి, మెడికల్‌ గ్రౌండ్‌ తదితర అంశాల్లో సాధారణ బదిలీల మాదిరిగా నిబంధనలు వర్తిస్తాయి.

Updated Date - Jun 13 , 2025 | 04:58 AM