ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan Mohan Reddy: కోటరీ వల్లే జగన్‌కు దూరం

ABN, Publish Date - Mar 13 , 2025 | 03:17 AM

వైసీసీ అధినేత జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లే ఆ పార్టీని వదిలి బయటకు వచ్చానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు తనకు, అధినేత జగన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

  • వైసీపీలో అవమానాలు, ఇబ్బందులు

  • నా మనసు విరిగిపోయింది

  • ఆయన మనసులో నాకు స్థానం లేదు

  • అదే మాట జగన్‌కు చెప్పి బయటకొచ్చా

  • మాజీ ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు

విజయవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వైసీసీ అధినేత జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లే ఆ పార్టీని వదిలి బయటకు వచ్చానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు తనకు, అధినేత జగన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ మనస్సు విరిచి ఆయననుంచి తనను దూరం చేయడంలో వారు విజయం సాధించారన్నారు. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో బుధవారం సీఐడీ విచారణ అనంతరం మీడియాతో విజయసాయి మాట్లాడారు. మూడున్నరేళ్లలో అవమానాలు ఎదుర్కొని తాను దిగిన ప్రతి మెట్టులోను చాలామంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి బయటకు రావడం వల్ల తాను ఏవిధంగాను నష్టపోలేదన్నారు. ఆ పార్టీలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో పనిచేశానని, అక్కడినుంచి బయటకు వచ్చినా జగన్‌ బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే, చుట్టూ ఉండే కోటరీ నుంచి బయటపడినప్పుడే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని, ఇంతకన్నా తాను చెప్పగలిగిందేమీ లేదన్నారు. ‘‘బయటినుంచి వెళ్లే సమాచారం తనకు అనుకూలంగా ఉంటున్నప్పుడు, ఆర్థికంగా, రాజకీయంగా తనకు లాభం ఉందనుకున్న వారిని మాత్రమే జగన్‌ వద్దకు కోటరీ పంపుతుంది. లేకపోతే దేవుడి వద్దకు చేరుకోలేం. నాయకుడు చెప్పుడు మాటలను నమ్మకూడదు. దానివల్ల నాయకుడితోపాటు పార్టీ, ప్రజలు కూడా నష్టపోతారు. వైసీపీలో ప్రస్తుతం అదే జరుగుతోంది.’’ అని విజయసాయి వివరించారు. జగన్‌ మనస్సులో తనకు స్థానం లేదని తెలిసినప్పుడు మనస్సు విరిగిపోయిందని, ఇక వైసీపీలో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్‌కు చెప్పి వచ్చేశానన్నారు. చుట్టూ ఉన్న వారి మాటలు వినవద్దని, ప్రజలకు భవిష్యత్తులో ఎంతో సేవ చేయాలని లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లో జగన్‌కు చెప్పానన్నారు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఘర్‌వాపసీ తనకు వర్తించదని, ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపారు. సీఐడీ అధికారుల ఎదుట ఏ విషయాలు చెప్పానో, భవిష్యత్తులోను భగవంతుడి సాక్షిగా అవే విషయాలు చెబుతానని విజయసాయి వ్యాఖ్యానించారు. .


పని ఒత్తిడిలో 52 శాతం ఉద్యోగులు

న్యూఢిల్లీ, మార్చి 12: కొవిడ్‌ తర్వాత ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోలేక భారత్‌లోని దాదాపు 52ు మంది ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న వెర్టెక్స్‌ గ్రూప్‌ తాజా సర్వేలో వెల్లడించింది. ఈ సంస్థ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న మొత్తం 1500 మందిపై సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. 23 శాతంపైగా ఉద్యోగులు సాధారణ పని గంటలకు మించి పనిచేస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది.

Updated Date - Mar 13 , 2025 | 03:17 AM