Vallabhaneni Vamsi: సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదు.. ఎందుకంటే..?
ABN, Publish Date - Feb 19 , 2025 | 07:03 PM
Vallabhaneni Vamsi: ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆ సెల్ఫ్ అఫిడవిట్‌లో ఆయన పేర్కొ్న్నారు. సత్యవర్థన్ పోలీసుల వద్దనున్నారని.. ఈ నేపథ్యంలో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదని స్పష్టం చేశారు. పోలీసుల అదుపులోనున్న సత్యవర్ధన్ ఎవరు దాడి చేశారు? ఎక్కడ దాడి చేశాడు? అనేది చెబుతాడన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 19: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. అలాంటి వేళ.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ బుధవారం సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఆ సెల్ఫ్ అఫిడవిట్‌లో ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. సత్యవర్థన్ పోలీసుల వద్దనున్నారని.. ఈ నేపథ్యంలో సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదని పేర్కొన్నారు. పోలీసుల అదుపులోనున్న సత్యవర్ధన్ ఎవరు దాడి చేశారు? ఎక్కడ దాడి చేశాడు? అనేది చెబుతారని తన అఫిడవిట్‌లో వల్లభనేని వంశీ తెలిపారు. అయితే వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Also Read: ఏదో తేడాగా ఉంది
వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇక జైలులో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలన్న పిటిషన్‌పై విచారణ సైతం వాయిదా పడింది. మరోవైపు బుధవారం కోర్టులో రెండు పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఒకటి.. సత్యవర్థన్‌కు భయపెట్టడం, కిడ్నాప్ చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడంలో వంశీ ఆదేశాల మేరకే జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read: వాయిదా పడ్డ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. ఎందుకంటే..?
అందుకు సంబంధించిన ఆధారాలు సైతం వారు కోర్టులో ప్రవేశపెట్టారు. అందులోభాగంగా 10 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తే.. మరింత సమాచారాన్ని రాబడతామని వారు వివరించారు. అలాగే ఈ కేసులో ఇంకా ఎంత మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర ఉందనే అంశంపై విచారణ జరుపుతామన్నారు.
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
అలాగే వంశీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే 10 రోజులు వంశీ జైలులో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో వంశీని కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే వంశీకి నడుం నొప్పి కారణంగా నిద్ర పోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: జగన్‌కు దమ్ము లేదు
అలాగే ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడం వంటి అంశాలపై సైతం ఈ రోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో జైలులోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులను కోర్టు ఆదేశించింది. అలాగే వంశీకి బెయిల్ అంశంపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టును గురువారానికి వాయిదా వేశారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 19 , 2025 | 07:06 PM