AP MLA's: వాయిదా పడ్డ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:13 PM
AP MLA's: వరుసగా రెండు రోజుల పాటు జరుగుతాయనుకొన్న ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయి. ఈ తరగతులకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అమరావతి, ఫిబ్రవరి 19: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అసలు ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ క్రమంలో రెండు రోజుల ముందు అంటే.. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
మరోవైపు ఈ ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను స్పీకర్ అయ్యన్నపాత్రుడితోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వయంగా కలిసి ఆహ్వానించారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును సైతం వారు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మార్చి 3వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 27న ఎన్నిక జరగనుంది. వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: జగన్‌కు దమ్ము లేదు
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
Also Read: ఏదో తేడాగా ఉంది
For AndhraPradesh News And Telugu News