ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP EAPCET 2025: వడ్లమూడి విజ్ఞాన్‌ ప్రభంజనం

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:56 AM

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు.

గుంటూరు(విద్య), జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు. కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకూర్మనాథ్‌ మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఎం.ఉమేష్‌ నారాయణన్‌ (347), ఎస్‌ డీ అర్షద్‌ ( 565), వై.విష్ణు కార్తీక్‌ (613), ఎస్‌.ప్రేమ్‌ సాగర్‌ (635), ఎస్‌ కే ఎమ్రోజ్‌ (736), వి.యశ్వంత్‌ మణికంఠ (883), ఎం.కవిత (2735), జీ వీ ఏ.తేజస్వి (3008), విద్యా కళ (3415) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 1000 లోపు ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు, 5000 లోపు ర్యాంకులు 25 మంది విద్యార్థులు, 10000 లోపు ర్యాంకులు 48 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల నుంచి ఏపీఈఏపీసెట్‌కు హాజరైన విద్యార్థులందరూ ర్యాంకులు సాధించారని తెలియజేశారు. ప్రణాళికబద్థమైన విద్యాబోధన వల్లనే అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వెల్లడించారు. 48 ఏళ్లకుపైగా అనుభవం, అవగాహనతో తాము విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు జె.మోహన్‌రావు, వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సిబ్బంది అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 09 , 2025 | 05:57 AM