ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు మొత్తం కొంటాం: మంత్రి అచ్చెన్న

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:29 AM

రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్‌ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్‌ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. పొగాకు పంటకు బీమా పథకాన్ని పునరుద్ధరించాం. ప్రమాద బీమాను రూ.7 లక్షలకు పెంచాం. ప్రత్యేక నిధితో తక్షణ పరిహారం అందే ఏర్పాట్లు చేశాం. గ్రేడ్‌-ఏ రకం క్వింటా రూ.12 వేలు, గ్రేడ్‌-బీ రకం రూ.5,400 ధర నిర్ణయించారు. ఐటీసీ, జేపీఐ సంస్థలతో 20 వేల మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలుకు ఒప్పందం చేశాం. మార్క్‌ఫెడ్‌ ద్వారా 75 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేపట్టాం’ అని అచ్చెన్న తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 04:32 AM